India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ADBలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పద్ధతిలో పండించిన పత్తిపంటను మాజీ మంత్రి జోగురామన్న పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పత్తి నాణ్యతకు పేరుందని పేర్కొన్నారు. సీసీఐ ద్వారా గుజరాత్‌లో క్వింటాల్ పత్తికి రూ.8800 చెల్లిస్తుండగా, ఇక్కడ తక్కువ ధర చెల్లించడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. త్వరలో రైతులు, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని గుజరాత్ పర్యటన తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఎస్. బ్లేస్సినా ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 29 నుంచి 30 వరకు గోదావరిఖనిలో జరగనున్న అండర్-17 రాష్ట్ర స్థాయి పోటీల్లో బ్లేస్సినా పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామ కళ్యాణి, పీఈటీ మమత తెలిపారు.
బెజ్జూర్ మండలంలోని సోమిని గ్రామం వద్ద గల ఎర్రబండ ప్రాణహిత నదిలో శనివారం ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రెండు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాచర్ల సమీపంలో మూడవ మృతదేహం మోయిస్ (19) లభ్యమైనట్టు ఎస్సై విక్రం తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నవంబర్ 2, 3, 4వ తేదీలలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్ బాల్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పది జిల్లాల్లోని 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో కారు బోల్తా పడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. ఆర్మూర్‌కు చెందిన బాలు, సాయిలు ఆదిలాబాద్‌లో జరిగే శుభకార్యానికి బయలుదేరారు. కాగా ఇచ్చోడ సమీపంలోని అగ్నిమాపక కార్యాలయం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కాగా ఇద్దరికి గాయాలు కాగా వారిని 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.
ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన జూడో క్రీడాకారులు సత్తా చాటారు. ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు, కోచ్ రాజు తెలిపారు. వీరంతా మహబూబ్ నగర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ZPHS బాలుర పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఈశ్వర ప్రసాద్, జోనల్ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు కార్తిక్ ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 28 నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరగనున్నాయి. రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు వచ్చే నెల 2వ తేదీ నుంచి మహబూబాబాద్‌లో జరగనున్నాయి. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల HM, సిబ్బంది అభినందించారు.
బెజ్జూర్ మండలం సోమిని ఎర్రబండ ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం జహీర్ హుస్సేన్ మృతదేహం లభ్యం కాగా సాయంత్రానికి ఇర్షాద్ మృతదేహాన్ని మహారాష్ట్ర రెస్క్యూ టీంతో కలిసి తెలంగాణ పోలీసులు వెలికితీశారు. ఇర్షాద్ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించినట్లు ఎస్సై విక్రం తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణం చుట్టు పక్కల ప్రాంతాలను కలుపుతూ ఆదిలాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఔడా)గా ఏర్పాటైంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రంగం ఇటీవల ప్రతిపాదనలు పంపగా వాటిని సర్కారు ఆమోదించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ తోపాటు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని ఆరు మండలాల్లో గల 107 గ్రామాలతో కూడిన ఔడాను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంప్రదింపుల కమిటీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంప్రదింపుల కమిటీకి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ సహాయకులుగా ఉండనున్నారు. ఈ కమిటీలో మొత్తం 15 మంది ఉంటారు.
Sorry, no posts matched your criteria.