India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంచిర్యాలలోని రాళ్లవాగుకు రూ.255 కోట్లతో ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో ఇందుకు సంబంధించి శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రాళ్లవాగుకు నిర్మించనున్న కరకట్టలతో పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసీ కాలనీ, రాంనగర్, పద్మశాలి కాలనీ, బాలాజీ నగర్ లకు వర్షాకాలంలో గోదావరి వరదల నుంచి రక్షణ లభించనుంది.
కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపు కమిటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ చోటు దక్కించుకున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ విధాన నిర్ణయాలపై పార్లమెంట్ సభ్యులకు అవగాహన కల్పించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి మరో ఎంపీ లక్ష్మణ్ సైతం చోటు దక్కించుకున్నారు.
INTUC జాతీయ అధ్యక్షులు డా.జి. సంజీవరెడ్డిని శనివారం తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ , యూనియన్ సెక్రటరీ జనక్ ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా సింగరేణిలో యూనియన్ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, జాతీయ, ఉమ్మడి రాష్ట్రాల INTUC వర్కింగ్ కమిటీ సమావేశం, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాల పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అంశాలపై వారు చర్చించారు.
అదిలాబాద్ కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా ఈ నెల 28న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ నెల 28న జిల్లాకు బీసీ కమిషన్ బృందం రానున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం ప్రజలు గమనించాలని మరొక సోమవారం యథాతథంగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.
ఆదివాసీల జానపదమైన గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన శ్రీ కనకరాజు మరణం బాధాకరమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ తరాలకు అందించడానికి ఆయన చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎర్రకోట వేదికగా గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన మరణం తీరని లోటని వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు, X లో ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో గతంలో SIగా విధులు నిర్వహించిన WSI సోనియా, ASI మను ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ సస్పెండ్ అయ్యారు. సోనియా ఒక కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై SP శ్రీనివాస్ విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 IG చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
భైంసా మండల కేంద్రంలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ బుచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 4 వరకు జరిగే పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ ఐడీ కార్డుతో హాజరు కావాలని సూచించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహిత గుస్సాడి కనక రాజు పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నామని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ సుగుణ తెలిపారు. శనివారం మార్లవాయిలో కనకరాజు పార్థివ దేహానికి ఆమె నివాళులర్పించారు. కనకరాజు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సుగుణ తెలిపారు.
కడెం ప్రాజెక్టు వద్ద కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పెద్దూరు గ్రామానికి చెందిన గోపు మల్లేశ్ అనే వ్యక్తి గొర్రెల మందను మేతకి కడెం ప్రాజెక్టు కింది వైపు వెళ్లాడు. ఈక్రమంలో పక్కనే ఉన్న కాలువ ఒడ్డు నుంచి కొండచిలువ గొర్రెపై దాడి చేసి హతమార్చింది. అక్కడికి చేరుకున్న కాపరి కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. ఓ వ్యక్తి బండరాయి విసరడంతో కొండచిలువ నీళ్లలోకి పారిపోయింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆదివాసీ గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు మృతి పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనక రాజు మృతి చెందడం బాధాకరం అన్నారు. గుస్సాడీ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆయన మరణం సమాజానికి తీరని లోటు అని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.