India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. CI సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మోచిగల్లికి చెందిన బాలశంకర్ కృష్ణను సామల ప్రశాంత్ అనే వ్యక్తి ఈనెల 12న వివేకానంద చౌక్‌లో కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI పేర్కొన్నారు

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీసు మీట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యోగా పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. జైనథ్ పోలీసుస్టేషన్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆర్.రూప యోగా పోటీల్లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఆమెను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తంతో పాటు పలువురు అభినందించారు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ స్టేషన్‌లో హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూరులోని ఆదివాసీ మెస్రం వంశస్థుల ఆరాధ్యదైవం నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. గురువారం సాయంత్రం 6 గంటలకు జాతర ఉత్సవాల్లో భాగంగా కళాకారుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆదివాసీ నృత్యాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఆదివాసీలు, ఉమ్మడి జిల్లా ప్రజలు హాజరుకావాలని కోరారు.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో గురువారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.50తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని CM రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతికుమారితో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు చేయాలన్నారు.

నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి, భుక్తి, విముక్తి కోసం కొమురం భీం పోరాటం చేసి మరణించాడు. అప్పుడు గిరిజనుల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ ADBజిల్లాకు వచ్చారు. గిరిజనుల సమస్యలను తెలుసుకోవడానికి నాగోబా జాతర వేదిక కావాలని ఆయన భావించి 1942లో నిర్వహించాడు. అప్పటి నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు.

ఇచ్చోడ మండలం దుబాయ్ పేటకు చెందిన ఆదివాసీ కళాకారులు దిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభను కనబర్చారు. ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని కొమ్ము కోయ నృత్యం ప్రదర్శించామన్నారు. తమ ప్రతిభతో అందరినీ మెప్పించినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్యంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) HYD బ్రాంచ్ మేనేజింగ్ కమిటీకి ADBకు చెందిన CA శైలేష్ ఖండేల్వాల్ ఎన్నికయ్యారు. 2025-2029 కాలానికి ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలికి మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా పట్టణానికి చెందిన వ్యక్తి ఎన్నికకావడం విశేషమైంది. ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వృత్తి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
Sorry, no posts matched your criteria.