Adilabad

News January 29, 2025

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

image

విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఎంపీ నగేష్ ఎమ్మెల్యే, వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో, లాల్ టేక్డిలోని గిరిజన సంక్షేమ కళాశాలతో పాటు యేందా గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో నూతన అదనపు గదులు, వంట గదుల భవన నిర్మాణాలకు వారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.

News January 29, 2025

ఉట్నూర్: ఏసీబీకి పట్టుబడ్డ వెటర్నరీ డాక్టర్

image

ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్‌లో లంచం తీసుకుంటూ పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి రమేశ్ రాథోడ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాగా బుధవారం తన కార్యాలయంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆయనను పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 29, 2025

రేపు నాగోబా జాతర వద్ద ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

image

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర వద్ద ఈనెల 30న గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ADB కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం సాయంత్రం 6.00 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రజలందరూ హాజరై తిలకించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

News January 29, 2025

గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మన్నూర్ గ్రామం వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు ఎవరు అన్నది ఇంకా గుర్తు తెలియరాలేదు.

News January 29, 2025

ఇచ్చోడ: అప్పు తీర్చలేనని పురుగుమందు తాగి ఆత్మహత్య

image

పురుగుమందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. SI తెలిపిన వివరాల ప్రకారం.. బోరిగామకు చెందిన బోల్లి రాజు(40) గ్రామ సంఘం నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నారు. అప్పు కట్టాల్సిన తేదీ రావడంతో తీసుకున్న డబ్బులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందారు.  దీంతో గ్రామ సమీపంలోని పత్తి చేనులో పురుగుమందు తాగి మృతి చెందినట్లు SI తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 28, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,950గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.110తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News January 28, 2025

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఖానాపూర్ ఎమ్మెల్యే

image

ఉమ్మడి జిల్లాకు అత్యధికంగా నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం సిరికొండ మండలంలోని వాయిపెట్ గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలను తిలకించి, ఆటను ఆడారు. మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.

News January 27, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,060గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News January 27, 2025

ADB: నాగదేవుడు పాలు తాగుతాడనే విశ్వాసం.!

image

నాగోబాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్రం వంశీయులు గోదావరి నుంచి తెచ్చిన జలంతో నాగోబా దేవుడి విగ్రహాన్ని, ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు, రాగి ముంతలో పాలు తెస్తారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటిని కొత్త టవల్‌తో కప్పి పుట్టపై ఉంచుతారు. అయితే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది.

News January 27, 2025

ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన ADB కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను ఆదివారం జైనథ్ మండలం పిప్పర్ వాడ గ్రామంలో కలెక్టర్ రాజర్షి షా లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకుల పాల్గొన్నారు.