India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలోని జవహర్ భవన్లో “శక్తి అభియాన్” జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణక్క, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇందిరా ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా సహజ ప్రకృతి అందాలకు నిలయమని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇవి మరింత ప్రాచుర్యంలోకి వస్తాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలకు కొదువ లేదన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి టూరిజమ్ శాఖ కృషి చేస్తోందని, వెలుగులోకి రాని ప్రకృతి సోయగాల గురించి బయటి ప్రపంచానికి తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రైతులు పండించిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేటప్పుడు ఆరబెట్టి తీసుకువెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి తేమ శాతం నిర్ధారణ పై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రైతులు పండించిన పత్తిని 8 శాతం తేమ మించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని సూచించారు.
ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రజాగళం బహిరంగ సభ దృష్ట్యా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామం చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అడుగడుగునా పోలీసులు మొహరించారు. ఇథనాల్ రోడ్డును పూర్తిగా ముసివేశారు.
CCI ద్వారా పత్తి కొనుగోళ్ల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. వానకాలం సీజన్లో మండలంలో 10.15 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. 3.96 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంట సాగులో ఆదిలాబాద్ అగ్రస్థానంలో ఉండగా, ఆసిఫాబాద్ జిల్లా 3.30 లక్షల ఎకరాల్లో సాగైంది. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వరుసగా 1.47 లక్షలు, 1.42 లక్షల ఎకరాల్లో పంట సాగైంది.
మంచిర్యాల పట్టణ అభివృద్ధికి వ్యాపారస్తులతో పాటు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలో జరుగుతున్న రోడ్ల వెడల్పు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వ్యాపార దుకాణాల సముదాయాలు నిబంధనల ప్రకారం ఉండాలని పేర్కొంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. పట్టణ సుందరీకరణ పనులు అభివృద్ధిలో భాగమని ఎమ్మెల్యే అన్నారు.
కల్వర్టు నీటిలో శిశువు మృతదేహం లభ్యమైన ఘటన సారంగాపూర్ మండలం బోరేగాం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శ్రీకాంత్ వివరాల మేరకు… గ్రామ శివారులోని చిన్న కల్వర్టు దగ్గర నీటిలో ఒక మగ శిశువు స్థానికులకు కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తు పది నెలల బాలుడు బకెట్లో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తేజాపూర్ గ్రామానికి చెందిన గిర్మాజీ- సునీత దంపతుల కుమారుడు తన్వీజ్ ఆడుకుంటూ వెళ్లి బాత్ రూమ్లో ఉన్న బకెట్లో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి బాలుడు మృతి చెంది కనిపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై పోశెట్టి తెలిపారు.
కొమరం భీమ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కొమరం భీం 84వ వర్ధంతి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్లో భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొమరం భీం చేసిన పోరాటం త్యాగం మరువలేనిది అన్నారు. అతని అడుగుజాడల్లో నడవాలి అన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ కార్వా (42) అనే వ్యాపారి కారు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..ఇవాళ ఉదయం కారులో హైదరాబాదుకు బయలుదేరిన రాజేష్ సిద్దిపేట-గద్వేల్ మార్గమధ్యలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.