India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదివాసీ యోధుడు.. అరణ్య సూర్యుడు.! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ కొమురం భీం అని మాజీ మంత్రి KTR (X) వేదికగా పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి.. కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమ బాటలో.. ఉజ్వల ప్రగతి దారిలో జల్.. జంగల్.. జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించామన్నారు.
ఐటీఐ పాసైన విద్యార్థులకు ఈనెల 21న ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ఈ మేళలో పాల్గొని శిక్షణార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. మేళాలో పాల్గొనేవారు apprenticeship.gov.in పోర్టల్ లో నమోదు చేసుకొని తగిన పత్రాలతో హాజరు కావాలన్నారు.
కేయూ పరిధిలోని డిగ్రీ, పీజీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు 2024- 25 విద్యా సంవత్సరం కాలపరిమితికి సంబంధించి రాత, ప్రాక్టికల్, సెమినార్ పరీక్షలు క్లియర్ చేయడానికి అనుమతి ఇస్తూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పరీక్షా ఫీజుకు సంబంధించి మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.
మహమ్మద్ ప్రవక్త పై యతి నరసింహానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బోథ్ ముస్లిం జేఏసీ సభ్యులు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. యతి నరసింహానంద సరస్వతి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న శుక్రవారం బోథ్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని సహకరించాలని కోరారు.
DR.BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. 2022–23, 2023-24లో డిగ్రీలో చేరిన 2nd, 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, సకాలంలో ఫీజు చెల్లించని వారు 30 తేదీలోపు చెల్లించొచ్చని తెలిపారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్ష తప్పదని శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని జిల్లా SP డీవీ శ్రీనివాసరావు అన్నారు. SP మాట్లాడుతూ..వ్యక్తి హత్యకు కారణమైన 16మందికి జీవిత ఖైదు రూ.1,49లక్షల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి MV.రమేష్ బుధవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.
అతిగా మద్యం సేవిస్తున్నాడని కుటుంబీకులు మందలిస్తారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెల్లంపల్లి మండలంలో చోటుచేసుకుంది. తాళ్లగురజాల SIరమేష్ వివరాల ప్రకారం..దుబ్బపల్లికి చెందిన మహేష్(28)అతిగా మద్యం సేవిస్తుండేవాడు కుటుంబ సభ్యులు మందలిస్తారనే భయంతో సోమవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు మంచిర్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.
ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లను రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, MLC దండే విఠల్, MLA కోవా లక్ష్మీ పాల్గొన్నారు.
ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీం 84వ వర్ధంతి కార్యక్రమానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP, డి.వి. శ్రీనివాసరావు అన్నారు. కెరామెరి మండలం జోడెన్ ఘాట్ గ్రామంలో గురువారం జరగనున్న భీమ్ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి సీతక్క రానున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 460మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 17న పబ్లిక్ హాలిడేగా ప్రకటించినట్లు ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఈ హాలిడే ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్9వ తేదీన రెండవ శనివారం పని దినంగా పాటించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.