India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని సూచించారు. కాగా గడువు ఈ నెల 15తో ముగుస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
>>SHARE IT
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు నెలల్లో పరందోలి, కరంజివాడ, లక్మాపూర్, ఇందాపూర్ ప్రాంతాల్లో పులి సంచరించగా స్థానికులు ఆందోళన చెందారు. తాజాగా ఇదే మండలంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలియడంతో జంకుతున్నారు. మరోవైపు ఆయా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోడేఘాట్ FRO జ్ఞానేశ్వర్ సూచిస్తున్నారు.
ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ నేడు (సోమవారం) సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివరాలు ఇలా.. కాగజ్‌నగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న అలాయ్- బలాయ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు దహెగాం ప్రెస్‌క్లబ్ మొదటి వార్షికోత్సవానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బెజ్జూర్ మండల కేంద్రంలో, 4 గంటలకు ఈస్గాంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేనందున కడెం ప్రాజెక్టు వరద తగ్గింది. ప్రాజెక్టులోకి 461 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 499.350 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాళ్లకు 669, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్మాపూర్ వాగుపై వంతెన లేకపోవడంతో ఆసుపత్రికి పోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. శనివారం ఎడ్లబండిపై డీజే బాక్స్ తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ వాపోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మరపగూడకు చెందిన పూనం అశోక్ MBBSలో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం విద్యార్థిని శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా మెస్రం దుర్గం, సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు రూపాదేవ్, తదితరులు పాల్గొన్నారు.
దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంత్ పేట్‌కు చెందిన పోలీస్ బొర్రన్న (50)మృతి చెందాడు. దిలావర్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రన్న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతణ్ని 108లో నిర్మల్ ఏరియా అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడన్నారు.
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ మహిళల జట్టు శనివారం మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా జట్టు, కోచ్ అరవింద్ కు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కనపర్తి రమేష్, కోశాధికారి అలుగువెళ్లి రమేష్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికి మిఠాయిలు తినిపించారు.
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.