Adilabad

News April 20, 2024

ADBలో విషాదం.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్ మండలంలోని పిప్పల్ దరి గ్రామానికి చెందిన ప్రేమికులు భుజంగరావు, కవిత శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని చికిత్స నిమిత్తం జిల్లా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో కవిత అక్కడికక్కడే మృతి చెందగా, భుజంగరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధిత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2024

ఆదిలాబాద్: ఎల్లుండే లాస్ట్… APPLY NOW

image

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లమోలలో ప్రవేశంకోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలీసెట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భరద్వాజ పేర్కొన్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, మే 24 న ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. రూ.100 రుసుముతో APR 24 వరకు ఛాన్స్ ఉందన్నారు

News April 20, 2024

మంచిర్యాల: గడ్డం వంశీకృష్ణ ఆస్తి రూ.24.09 కోట్లు

image

పెద్దపల్లి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పూర్తి వివరాలతో అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. రూ.24.09 కోట్ల ఆస్తులున్నాయని వివరించారు. నగదు, డిపాజిట్ల రూపంలో రూ.93.27 లక్షలు, వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో రూ.11.39 కోట్లు ఉన్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 4.18 ఎకరాలు, సంబల్‌పుర్‌(ఒడిశా)లో 10.09 ఎకరాల భూమి, అప్పులు రూ.17.76 లక్షలు ఉన్నాయని వెల్లడించారు.

News April 20, 2024

MNCL: తెల్లారితే కూతురి పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

image

తెల్లారితే కూతురి పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఎంసిసి కాలనీలో నివాసం ఉండే కమలాకర్ రావు శుక్రవారం రాత్రి బైక్ పై వెళుతుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఆదివారం కూతురు వివాహం ఉండగా అదే పనుల్లో ఉన్న కమలాకర్ రావు రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 20, 2024

మంచిర్యాల MLA పై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ నెల 17న స్థానిక పాత మంచిర్యాలలో నిర్వహించిన శ్రీరామనవమి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దేవాలయం అభివృద్ధికి రూ.లక్ష విరాళంగా అందజేసి, ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు ఎన్నికల సంఘం నియమించిన బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News April 20, 2024

ADB: గల్ఫ్ కార్మికులకు ఏది భరోసా..!

image

ఎడారి దేశాలకు వలస వెళ్లి కార్మికులకు భరోసా కరువైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందాలన్న వారికి అడ్డంకులు తప్పడం లేదు. ఇప్పటివరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి 70 వేలమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. పొట్టకూటి కోసం వెళ్లి అక్కడి వాతావరణం పడక మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. దీంతో వారి కుటుంబానికి తీరని శోకం మిగులుతోంది. గల్ఫ్ బాధితులను ఆదుకొని భరోసా కల్పించాలని కోరుతున్నారు.

News April 20, 2024

బైంసాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. SI శ్రీకాంత్ వివరాల ప్రకారం భైంసా మండలం చింతల్బోరి గ్రామశివారులోని పంటపొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం స్థానికులకు కనిపించింది. దీంతో వారు సమాచారంతో పోలీసులకు అందించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 55 ఉంటుందని మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే పోలీసులను సంప్రదించాలని ఎస్సై తెలిపారు.

News April 20, 2024

నిర్మల్ : హోంగార్డుపై కేసు నమోదు

image

మోసం చేసి బెదిరింపులకు పాల్పడుతున్న హోంగార్డ్ షమీముల్లా ఖాన్ (షకీల్) పై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ సీఐ అనిల్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ పలువురితో పరిచయం పెంచుకొని అతితక్కువ ధరకు భవన నిర్మాణ సామగ్రిని ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు తీసుకొని నిర్మాణ సామాగ్రి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 20, 2024

ఆదిలాబాద్: బంగారం లేని ఎంపీ అభ్యర్థి

image

ADB కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున MLA వెడ్మబొజ్జు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అఫిడవిట్‌లో తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగులో ఉన్నట్లు సుగుణ వెల్లడించారు. 2023-24లో తన పేరిట రూ. 5,64,170 ఆదాయం ఉందని చూపించగా..భర్త పేర రూ. 19,08,010 ఉన్నట్లుగా నివేదికలో ప్రస్తావించారు. చరాస్తులు రూ. 12,10,000, స్థిరాస్తులు రూ. 42,50,000 చూపించారు.

News April 20, 2024

ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా అధికారులు ఎన్నికలపై నిర్వహిస్తున్న సమావేశాలను ఆయనకు వివరించారు.