Adilabad

News April 18, 2024

కాసిపేట: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..!

image

కాసిపేట మండలంలోని కోమటిచేనుకు చెందిన బెడ్డల మౌనిక అనే మహిళ బుధవారం విద్యుత్ షాక్ తో మృతి చెందింది. వాటర్ ట్యాంకులో నీటిని పరిశీలించేందుకు ఇంటిపైకి ఎక్కగా తెగిపోయిన విద్యుత్ వైరు ఇనుప రేకులకు తాకింది. మౌనిక వాటిని తాకడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2024

ఆదిలాబాద్: నేటి నుంచే షురూ

image

పార్లమెంట్‌ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఏడు శాసనసభ స్థానాలతో విస్తరించిన ADB పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఫిబ్రవరి 8న విడుదల ఓటరు జాబితా ప్రకారం మొత్తం 16,44,715 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,57,248 మంది ఓటర్లతో నిర్మల్‌ మొదటిస్థానంలో ఉంటే 2,10,915 ఓటర్లతో బోథ్‌ నియోజకవర్గం చివరిస్థానంలో ఉంది. ADB కలెక్టరేట్‌ ఆవరణలో నేటి నుంచి ప్రారంభం కానున్న నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది.

News April 18, 2024

MNCL: IPL క్రికెట్ బెట్టింగ్..పోలీసుల అదుపులో పది మంది

image

మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద దగ్గర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మందిని బుధవారం సాయంత్రం పట్టుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్ రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. IPL క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, బెట్టింగ్ ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News April 18, 2024

ఉమ్మడి జిల్లాలో భగభగమంటున్న భానుడు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, బేల, జైనథ్, సిరికొండ, బోథ్, మావల, పిప్పల్ధరి, చెప్రాల, భోరజ్ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమురం భీం జిల్లాలో అత్యధికంగా కాగజ్ నగర్లో 44.2 డిగ్రీలు నమోదయింది. మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం దేవులవాడలో అత్యధికంగా 44, నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో 43.2 డిగ్రీలు నమోదైంది.

News April 18, 2024

ASF: ఈదురు గాలులకు ఎగిరిపడిన వృద్ధురాలు

image

ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం 5గంటలకు ఈదురు గాలులకు బురుగూడకి చెందిన వృద్ధురాలు చున్నూబాయి ఎగిరి పడింది.. సాయంత్రం వర్షం వస్తుండడంతో వృద్దురాలు చున్నూబాయి ఇంటి ముందు నిలబడి ఉంది. ఈదురుగాలులు బలంగా వీయడంతో చున్నూబాయి ఎగిరిపడి ముళ్ల కంపలో చిక్కుకుంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యయి. వెంటనే ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్నారు.

News April 17, 2024

ADB: తొలి ప్రయత్నంలోనే సివిల్స్

image

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆదిలాబాద్‌కి చెందిన ఆదా వెంకటేష్-వాణి దంపతుల కుమారుడు సందీప్ సత్తా చాటాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ లో 830వ ర్యాంకు సంపాదించి ఔరా అనిపించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించినట్లు సందీప్ తెలిపారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమన్నారు. కాగా సందీప్ తండ్రి వెంకటేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

News April 17, 2024

ఇచ్చోడలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి.. వివరాలు ఇవే..!

image

ట్రాక్టర్ అదుపుతప్పి <<13067453>>వ్యక్తి మృతి<<>> చెందిన ఘటన ఇచ్చోడ మండలం చించోలి క్రాస్ రోడ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. SI నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డర్ గూడకు చెందిన రాజేందర్ (33) ఇచ్చోడలో ట్రాక్టర్‌తో ఇటుక లోడు ఖాళీ చేసి వస్తుండగా ట్రాక్టర్ అతివేగంగా నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 17, 2024

సివిల్స్‌లో సత్తాచాటిన ఆదిలాబాద్ జిల్లా బిడ్డ

image

సివిల్ సర్వీసెస్ మంగళవారం వెలువరించిన ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ర్యాంక్ సాధించాడు. మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ సివిల్స్‌లో 718 ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు విశాల్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా తండ్రి వెంకన్న మంచిర్యాల ACPగా విధులు నిర్వహిస్తున్నారు.

News April 17, 2024

ADB: హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు

image

హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసిన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. వివరాలిలా.. అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా.. నిర్మాణ పనులు నిలిపివేయాలని వెళ్లిన మున్సిపల్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై హెడ్ కానిస్టేబుల్ మురాద్ అలీపై మున్సిపల్ కమిషనర్ MD ఖమర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.

News April 17, 2024

ఆదిలాబాద్: BRS టు CONGRESS వయా BJP

image

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ వలసలు కొనసాగుతున్నాయి. కొన్నినెలల క్రితం BRS నుండి BJPలో చేరిన ప్రముఖ నాయకులు తాజాగా BJPని వీడటం చర్చనీయాంశమైంది. బోథ్ మాజీ MLA రాథోడ్ బాపురావ్ అసెంబ్లీ ఎన్నికల వేళ BJPలో చేరి తాజాగా ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో సోమవారం CM సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అటు ADBజడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్ సైతం ఫిబ్రవరిలో బీజేపీలో చేరగా మంగళవారం తిరిగి KTR సమక్షంలో BRSలో చేరారు.