Adilabad

News January 14, 2025

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో దస్తూరాబాద్ విద్యార్థి ప్రతిభ

image

కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025లో  నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ ZHS విద్యార్థి కొట్టే అభిషేక్ ప్రతిభ చాటి మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఇందులో 102 కేజీ కేటగిరి యూత్ విభాగంలో సిల్వర్, జూనియర్ విభాగంలో సిల్వర్, సీనియర్ విభాగంలో బ్రాంజ్ మెడల్‌లను సాధించాడు. అభిషేక్‌ను HM వామాన్ రావ్, PET నవీన్ అభినందించారు.

News January 14, 2025

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

image

డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరం స్పెల్-II, ఓల్డ్ బ్యాచ్ 2016 అంతకుముందు బ్యాచ్‌ల వారు అలాగే రీ అడ్మిషన్ తీసుకున్న వారు సప్లిమెంటరీ ఫీజును ఈ నెల ఈనెల 14వరకు చెల్లించవచ్చన్నారు. ఇందుకు రూ. 500 అపరాధ రుసుం కట్టాలన్నారు.

News January 14, 2025

ADB: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

బ్యాంకు సామగ్రి చోరీకి యత్నం.. ఒకరికి రిమాండ్: CI

image

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

News January 13, 2025

కోటపల్లి: కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు

image

కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.

News January 13, 2025

నేడు ఆసిఫాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క రాక

image

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్నట్లు మంత్రి పీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెబ్బన, వాంకిడి, కెరమెరి మండలాల్లో జంగు బాయి దేవత సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అక్కడ నుంచి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

News January 13, 2025

ADB: జనవరి 22న జిల్లాకు మందకృష్ణ మాదిగ

image

జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో MRPS నాయకుడు ఎల్లన్న ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూర్యప్రసాద్, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యదర్శిగా రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. ఈనెల 22న జిల్లాకు మందకృష్ణ మాదిగ వస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

News January 13, 2025

సిర్పూర్(టి): పశువుల రవాణా.. ముగ్గురి ARREST

image

అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్న ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మండల కేంద్రంలో ఆదివారం పట్టుకున్నారు. అనంతరం పశువులను గోశాలలకు తరలించి, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News January 13, 2025

కోటపల్లి: కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు

image

కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.

News January 13, 2025

సెపక్ తక్రా జాతీయస్థాయి పోటీల మేనేజర్లుగా గోలేటివాసులు

image

రెబ్బన మండలం గోలేటికి చెందిన క్రీడాకారులు జాతీయస్థాయి సీనియర్ సెపక్ తక్రా మేనేజర్లుగా ఎంపికయ్యారు. ఆదివారం గోలేటిలో తెలంగాణ రాష్ట్ర సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. జనవరి 10నుంచి 14వరకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 34వ సీనియర్ జాతీయస్థాయి మహిళల టీం మేనేజర్‌గా పర్లపల్లి శిరీష, పురుషుల మేనేజర్‌గా రామకృష్ణారెడ్డి ఈనెల 11న ఎంపికయ్యారని తెలిపారు.