Adilabad

News April 16, 2024

నిర్మల్: మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ

image

నిర్మల్ పట్టణానికి చెందిన యమున అనే మహిళ నుంచి 2 తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అపహరించారు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా శివాజీ చౌక్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొలుసు లాక్కెళ్లారు. పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్ తెలిపారు.

News April 16, 2024

ADB: నిర్వహకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DYSO వెంకటేశ్వర్లు తెలిపారు. నిర్వాహకులకు గౌరవవేతనం, ఉచితంగా క్రీడా సామాగ్రి అందిస్తామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు వారి వివరాలతో ఈ నెల 22వ తేదీలోపు ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయం చిరునామాకు పంపించాలన్నారు.

News April 15, 2024

ఆదిలాబాద్: పాలిసెట్ దరఖాస్తుకు 22న LAST

image

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లమోలలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలీసెట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ పేర్కొన్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, మే 17న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. 150 మార్కులతో పరీక్ష ఉంటుందన్నారు.

News April 15, 2024

ADB: ఓబీసీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా అశోక్

image

ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం ఇన్‌ఛార్జ్‌గా కౌన్సిలర్ అంబకంటి అశోక్‌ను నియమిస్తూ ఓబీసీ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ శ్రీకాంత్ గౌడ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ అంబకంటి అశోక్ ప్రస్తుతం పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా ఆయనకు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

News April 15, 2024

ఆదిలాబాద్: కాంగ్రెస్‌లోకి మాజీ MLA..?

image

బోథ్ మాజీ MLA రాథోడ్ బాపూరావ్ కాంగ్రెస్‌లో చేరుతారనే టాక్ నడుస్తోంది. సోమవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కను కలవడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS సిట్టింగ్‌ MLAగా ఉన్న ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో అసంతృప్తితో బీజేపీలో చేరారు. కొద్దికాలంపాటు ఆ పార్టీలో కొనసాగిన ఆయన BJPకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.
– మీ కామెంట్..?

News April 15, 2024

కాగజ్ నగర్: బిల్లులు ఇవ్వడం లేదని స్కూలుకు తాళం

image

కాగజ్నగర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు నూతన బిల్డింగ్ నిర్మించి ఎనిమిది నెలలైనా బిల్లు ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహంతో భవనం నిర్మించిన కాంట్రాక్టర్ తాళం వేశారు. ఈ పాఠశాలలో సుమారు 252 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు నుంచి ఫైనల్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు స్కూల్ ముందే కూర్చున్నారు. దీంతో ఉన్నతాధికారులు మూడు రోజుల గడువు కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతో తాళం తీశారు.

News April 15, 2024

BREAKING: ఆదిలాబాద్‌లో రోడ్డు ప్రమాదం

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మావల బైపాస్ వద్ద రోడ్డు క్రాస్ అవుతున్న ద్విచక్ర వాహనాన్ని అటుగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు కాగా అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న మావల పోలీస్ స్టేషన్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

News April 15, 2024

బెల్లంపల్లి: రైలు కింద పడి ఒకరి ఆత్మహత్య

image

అప్పుల బాధ, కల్లుకు బానిసై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామానికి చెందిన బన్న మల్లేష్ (49) కల్వరి చర్చి వెనకాల రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె. సురేష్ గౌడ్ తెలిపారు. అప్పుల బాధతో కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

News April 15, 2024

కాసిపేట: రైలులో ప్రయాణిస్తూ మహిళ మృతి

image

కడప జిల్లాకు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. గత కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News April 15, 2024

ఆదిలాబాద్: గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓటు బ్యాంకు

image

ఉత్తర తెలంగాణ సరిహద్దులోని ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంపై పార్టీలు దృష్టి సారించాయి. గత పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో గెలిచిన ఆదిలాబాద్ ఎంపీ బాపురావు 3,77,374 ఓట్లను సాధించాడు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4,43,13 ఓట్లు దక్కాయి. దీంతో ఈ సారి కూడా గెలుపు తమదేనంటూ బీజేపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.