Adilabad

News April 8, 2024

కాసిపేటలో క్షుద్ర పూజల కలకలం

image

కాసిపేట మండలంలోని చిన్న ధర్మారంలో ఓ
ఇంటి ముందు కొబ్బరికాయ, పసుపు కుంకుమ, నల్లతాడు, బొమ్మ పెట్టడంతో గ్రామస్థులు భయాందోళనకు గురైయ్యారు. కొందరు వ్యక్తులు కావాలని చేతబడి చేశారని సదరు ఇంటి యజమాని పేర్కొన్నారు. కాగా కొందరు వ్యక్తులు కావాలని ఈ పనికి పాల్పడినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2024

జన్నారంలో కురిసిన భారీ వర్షం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్ 44.4, మంచిర్యాల 43.5, నిర్మల్ 42.2, ఆదిలాబాద్ 40డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ జన్నారంలో ఆదివారం వర్షం కురిసింది. మండలంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. కాగా, ఈ అకాల వర్షాలతో మామిడి, మొక్కజొన్న రైతులు పంట నష్టపోయామని వాపోతున్నారు.

News April 8, 2024

మంచిర్యాల: మహిళ ఉద్యోగితో బూట్లు కడిగించిన అధికారి

image

మహిళ ఉద్యోగితో బూట్లు కడిగించిన ఘటన మందమర్రి ఏరియా కేకే 5 గనిలో జరిగింది. గని కార్యాలయ సూపరింటెండెంట్‌ అదే ఆఫీస్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగితో తన బూట్లు కడిగించాడు. ఆ అధికారి తీరుతో కలత చెందిన ఆమె ఈ విషయాన్ని పలువురు కార్మికసంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 8, 2024

ఉమ్మడి ఆదిలాబాదుకు ఎల్లో అలెర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నుంచి నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సందర్బంగా ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

News April 7, 2024

నిర్మల్: మద్యం మత్తులో ఆత్మహత్య

image

నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామానికి చెందిన షెక్ ఇసా(45) తాగుడుకు బానిసై మద్యం మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

News April 7, 2024

బెజ్జూర్: పులి దాడిలో ఆవు మృతి

image

పులి దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన బెజ్జూర్ రేంజ్‌లో ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూరు మండలం పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన గుర్లె శంకర్ ఆవు శనివారం ఉదయం సిద్దాపూర్ అటవీ ప్రాంతానికి మేతకు వెళ్ళింది. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. సంఘటన స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు.

News April 7, 2024

ADB: ఆటో బోల్తా ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

image

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి జైనథ్ వైపు వెళ్తున్న ఆటో.. తర్నం బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న భరత్‌కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందగా పుష్ప, పద్మా అనే మహిళలకు గాయాలయ్యాయి. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ సాయినాథ్ తెలిపారు.

News April 7, 2024

MNCL: BJP, BRSలను ఎన్నికల్లో ఓడించాలి: మంత్రి శ్రీధర్ బాబు

image

పార్లమెంట్ ఎన్నికల్లో BJP, BRSలను ఓడించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని అన్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.

News April 7, 2024

మందమర్రి: చికిత్స పొందుతూ సింగరేణి ఉద్యోగి మృతి

image

మందమర్రి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రామన్ కాలనీ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఆర్కేపీ ఓసిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న పాయల వెంకటేశ్వర్లు (53) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మందమరి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి తన బైక్ పై వస్తుండగా ఒకసారి అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు గాయం కావడంతో సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు..

News April 7, 2024

మద్యం అమ్మకాల్లో మంచిర్యాల టాప్..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడాదితో పోల్చితే 5 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. ఆదిలాబాద్‌లో రూ.385.58, ఆసిఫాబాద్‌లో రూ.269.99, మంచిర్యాలలో రూ.703,6, నిర్మల్‌లో రూ.448.83 లక్షల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మొత్తం గతేడాది రూ.1,716.60కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడు రూ.1,807.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాలలో అత్యధిక అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.