Adilabad

News April 7, 2024

బాసరలో విగ్రహాలు ధ్వంసం

image

బాసర మండలంలోని ఓ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న చింతామణి గణపతి ఆలయంలోని నాగదేవత, నందీశ్వరుని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. ఉదయం పూట ఆలయాన్ని శుభ్రం చేసే మహిళ ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుకలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

News April 7, 2024

ADB: ఉమ్మడి జిల్లాలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం గరిష్ఠంగా మంచిర్యాల జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 41, ఆదిలాబాద్ 42.4, నిర్మల్ 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News April 7, 2024

ఆదిలాబాద్: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

నేరడిగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి అత్యాచారయత్నం చేసినట్లు ఏఎస్ఐ మారుతి తెలిపారు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం చేయగా బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పరారైనట్లు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 7, 2024

BSPతోనే బహుజనులకు రాజ్యాధికారం: మంద ప్రభాకర్

image

ADB జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బహుజనులు శాశ్వత బానిసలు అవుతారన్నారు. BSP తోనే బహుజనులకు రాజ్యాధికారం లభిస్తుందన్నారు. జిల్లా నాయకులు రత్నపురం రమేష్, జంగుబాపు, తదితరులున్నారు.

News April 6, 2024

రాష్ట్రంలోనే 8వ స్థానంలో లక్షెట్టిపేట

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షెట్టిపేట రికార్డు స్థాయిలో 91.44 శాతం మున్సిపాలిటీ పన్నులు వసూలు చేసింది. రాష్ట్రంలోనే ఈ మున్సిపాలిటీ టాప్‌-8లో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో లక్షెట్టిపేట మొదటిస్థానంలో ఉండగా, భైంసా 47.29 శాతంతో రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. మంచిర్యాల 68.45 శాతం, ఆదిలాబాద్‌ 64.23 శాతం, నిర్మల్‌ 53.24, బెల్లంపల్లి 50.79, ఖానాపూర్‌లో 49% మాత్రమే పన్ను వసూళ్లు అయ్యాయి.

News April 6, 2024

తాంసీ: పెళ్లి కావటం లేదని యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదని యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన బోథ్ మండలంలో జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని కొత్తగల్లికి చెందిన జాదవ్ జ్ఞానేశ్వర్ (21)కు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూసినప్పటికీ కుదరక పోగా మనస్తాపంతో ఇవాళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు చల్లటి కబురు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి విషయం చెప్పింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.

News April 6, 2024

తలమడుగులో రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి శివారులోని అంతర్రాష్ట్ర రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పిప్పల్‌ గావ్‌కు చెందిన భోపాల్, ఈశ్వర్, అంకుశ్ బైక్‌పై ఉపాధి కోసం సుంకిడికి బయలుదేరారు. ఎదురుగా వస్తున్న మ్యాక్స్ పికప్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు ముగ్గురిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

News April 6, 2024

MNCL: ముందస్తు ఇంటి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ

image

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ముందస్తు ఇంటి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ కల్పించినట్లు మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి 2025 వరకు ఇంటి పన్ను మొత్తం ఈ నెల 30లోపు ముందస్తుగా చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

News April 6, 2024

నెన్నెల: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

image

మంచిర్యాల జిల్లానెన్నెల మండలంలోని కంబాల కుంట మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి మండలానికి చెందిన బలరాం(38) మృతిచెందగా, లంబడి తండాకు చెందిన నవీన్ తీవ్రంగా గాయపడ్డారు. శుభకార్యంలో పాల్గొని బెల్లంపల్లికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నవీన్‌ మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.