Adilabad

News April 1, 2024

ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. మార్చి 31 తేదీ వరకు ఉన్న గడువును ఏలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడగించారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
>>SHARE IT

News March 31, 2024

MNCL: విద్యార్థినులకు వేధింపులు.. 22 మందిని పట్టుకున్న పోలీసులు

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిలను షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారికి చెందిన 10 బైక్‌లు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించామని, 13 మంది మేజర్లపై కేసులు నమోదు చేసి, 9 మంది మైనర్లకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

News March 31, 2024

బెల్లంపల్లి: 14 మంది విద్యార్థులకు ప్రీమియర్ COEలో సీట్లు

image

బెల్లంపల్లి COE విద్యార్థులు 14 మంది ప్రతిష్ఠాత్మకమైన COEలో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. ప్రీమియర్(స్టేట్) COEలైన గౌలిదొడ్డి, చిలుకూరు, షేక్‌పేట్, అల్గనూర్, ఇబ్రహీం పట్నం COEల్లో 14మంది విద్యార్థులు సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మిగిలిన COEల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు.

News March 31, 2024

ASF: భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామానికి చెందిన రాము(25) కు సోనాపూర్ గ్రామానికి చెందిన రాంబాయితో వివాహం జరిగింది. రాము మద్యానికి బానిస కావడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్ళింది. దీంతో మద్యానికి బానిసైన రాము ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 31, 2024

బోథ్: బంధువుల పెళ్లికి వెళ్లి… అనంత లోకాలకు

image

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన బోథ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇచ్చోడకు చెందిన పోనకంటి సుకుమార్ సాకెర గ్రామానికి దగ్గరి బంధువుల పెళ్ళికి వెళ్ళాడు. తెల్లవారితే ఇంట్లో పెళ్లి అందరూ హాల్ది ఏర్పాట్లలో ఉన్నారు.సుకుమార్ పక్కనే ఉన్న సోనాల గ్రామానికి వెళ్ళాడు.గ్రామంలోని బస్టాండ్ పరిసరాలు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News March 31, 2024

కాగజ్ నగర్: రైలు కిందపడి ఝార్ఖండ్ వాసి మృతి

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ కథనం ప్రకారం.. బిలాస్పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రైలులో ఝార్ఖండ్ రాష్ట్రం గర్వ జిల్లా తెనర్కు చెందిన దిలీప్ కుమార్ సింగ్ ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News March 31, 2024

ASF: పురుగు మందు తాగి యువకుడు మృతి

image

రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గజ్జల భీం రావ్(35) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. వారు తెలిపిన కథనం ప్రకారం.. భీమ్‌రావ్ ఏ పని చేయకపోవడంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతని భార్య పుట్టింటికి వెళ్లింది.. మద్యానికి బానిసైన భీం రావ్ ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమెకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News March 31, 2024

ADB: అక్క పెళ్లి రోజే తమ్ముడు బలవన్మరణం

image

ఉట్నూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. అక్క పెళ్లి రోజే తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం లక్షటిపేటకి చెందిన అర్కవినోద్(25) ఉట్నూర్‌లో డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం అక్క అర్క అనసూయ పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా నార్నూర్ వెళ్లారు. వినోద్ ఇంటి వద్దే ఉండి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడూ ఒంటరితనంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.

News March 31, 2024

ADB: ‘ఉపాద్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

image

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకొవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మంచి నీటిని అందుబాటులొ ఉంచాలని, ఎండలో ఆడుకోకుండా చూడాలన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు మధ్యాహ్నం వేళల్లో తరగతులు నిర్వహించరాదని హెచ్చరించారు.

News March 30, 2024

ADB: శిక్షణ కానిస్టేబుళ్లకు పోలీసు విధులపై అవగాహన

image

ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 257 మంది కానిస్టేబుళ్లు బేసిక్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వన్ టౌన్, టూ టౌన్, మావల, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లలో వారికి పోలీసుల విధివిధానాలపై శనివారం అవగాహన కల్పించారు. దీని కోసం 257 మంది శిక్షణ కానిస్టేబుళ్లలను ఆయా పోలీస్ స్టేషన్‌లకు కేటాయించారు.