Adilabad

News March 30, 2024

జన్నారంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. మండలంలోని డీర్ పార్క్ వద్ద ప్రధాన రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలేరో.. జన్నారం వైపు వస్తున్న బైక్‌ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మందపల్లి గ్రామానికి చెందిన దేవి సుదర్శన్ (45) రక్షిత్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 30, 2024

కాసిపేట: భారీ నగదు స్వాధీనం

image

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న వరంగల్‌కు చెందిన మహేష్ వద్ద రూ.1,20,700/-, జార్పుల అమృ వద్ద రూ.2,75,000/-, దండేపల్లికి చెందిన వెంకటేష్ వద్ద రూ.2,97500/- నగదును స్వాధీనం చేసుకొని SSTటీం ఇన్‌ఛార్జ్‌కి అప్పగించినట్లు ఎస్సై వివరించారు.

News March 30, 2024

సుగుణక్క గెలుపునకు పూర్తి సహకారం: రేఖా నాయక్

image

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపునకు పూర్తిగా సహకరిస్తానని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. శనివారం పట్టణంలో ఆమెను రేఖా నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా సుగుణక్కను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, తదితరులు ఉన్నారు.

News March 30, 2024

ఉద్యాన నర్సరీలోని పండ్ల తోటల వేలం: పీవో

image

ఉట్నూర్ ఉద్యాన నర్సరీ లోని పండ్ల తోటల ఫల సాయాన్ని వేలం వేయనున్నట్లు పీవో ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి మరియు జామ తోటల ఫల సాయాన్ని వేలం పాట ఉంటుందని తెలిపారు ఆసక్తి గల వ్యాపారస్తులు, సంస్థలు ఏప్రిల్ 6న మధ్యాహ్నం 3 గంటలకు ఉట్నూర్ ఐటీడీఏ నర్సరీలో జరిగే వేలంపాటలో పాల్గొనాలని కోరారు. ఇతర వివరాల కొరకు ఐటీడీఏ ఉద్యాన అధికారి శ్రీ సుధీర్ కుమార్ (9032313933) లను సంప్రదించాలని సూచించారు.

News March 30, 2024

ఆదిలాబాద్: భానుడి భగభగలు.. బెంబేలెత్తుతున్న జనాలు..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తూ జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. శుక్రవారం రోజు నమోదైన ఉష్ణోగ్రతలు చూసుకుంటే. ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 43.3 ఉష్ణోగ్రత నమోదయింది. కొమరం భీం జిల్లాలో 42.7, నిర్మల్ జిల్లాలో 42.3, మంచిర్యాల జిల్లాలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 30, 2024

నిర్మల్: వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ

image

నిర్మల్ పట్టణంలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారం గొలుసు అపహరించుకుపోయాడు. సారంగాపూర్ మండలానికి చెందిన ఓ వృద్ధురాలు శుక్రవారం నిర్మల్ బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురుచూస్తోంది. ఓ వ్యక్తి అదును చూసి ఆమె మెడలోని బంగారు ఆభరణం అపహరించి పారిపోయాడు. బస్ స్టాండ్ గోడ దూకి తప్పించుకునే యత్నంలో స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసారు. పోలీస్ లకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2024

చెన్నూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

చెన్నూరు పట్టణంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బజ్జూరి రాజన్న అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందారు. భార్య పద్మతో కలిసి గురువారం పంట చేనుకు వెళ్లి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా కడారి సంతోష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ స్థానిక గోదావరి చౌరస్తా వద్ద ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపారు.

News March 30, 2024

నేరడిగొండ: కొడుకు వేధింపులు.. తండ్రి సూసైడ్

image

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు వేధింపులు తాళలేక తండ్రి ఆత్మహత్యే చేసుకున్నాడు. నేరడిగొండ మండలం రాజుల తండాకు చెందిన నూరిసింగ్ (60)కు ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు అంకుశ్ పెళ్లి చేసుకొని విడిగా ఉంటున్నాడు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ తండ్రిని నిత్యం వేధించేవాడు. దీంతో నూరిసింగ్ పొలం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.

News March 30, 2024

MNCL: హస్తం గూటికి మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి

image

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డం అరవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. రెండు, మూడు రోజులుగా ఊహాగానాలు వస్తున్నా ఆయన నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో ఆయన చర్చలు జరిపారు. కేకే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో అరవిందరెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడం ఖరారైంది.

News March 29, 2024

MNCL: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాట్ కామెంట్స్

image

కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ద షాక్, వాడు పోయిండు, వీడు పోయిండు అని ఒకటే ఊదరగొడుతుండ్రు.. ఇది శిశిర రుతువు.. పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలోకి పోతయ్.. మూలం మాత్రం స్థిరంగా ఉంటుంది. మళ్ళీ చైత్రం వస్తది. కొత్త ఆకులు చిగురిస్తాయి. మూలం నుంచి శక్తిని అందుకొని విజృంభిస్థాయి’ అన్నారు. ఇది ప్రకృతి సహజమని, ప్రతిదానికి షాక్ అయితే ఎలా అని పేర్కొన్నారు.