India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్ష తప్పదని శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని జిల్లా SP డీవీ శ్రీనివాసరావు అన్నారు. SP మాట్లాడుతూ..వ్యక్తి హత్యకు కారణమైన 16మందికి జీవిత ఖైదు రూ.1,49లక్షల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి MV.రమేష్ బుధవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.
అతిగా మద్యం సేవిస్తున్నాడని కుటుంబీకులు మందలిస్తారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెల్లంపల్లి మండలంలో చోటుచేసుకుంది. తాళ్లగురజాల SIరమేష్ వివరాల ప్రకారం..దుబ్బపల్లికి చెందిన మహేష్(28)అతిగా మద్యం సేవిస్తుండేవాడు కుటుంబ సభ్యులు మందలిస్తారనే భయంతో సోమవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు మంచిర్యాలకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.
ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లను రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వం వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, MLC దండే విఠల్, MLA కోవా లక్ష్మీ పాల్గొన్నారు.
ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీం 84వ వర్ధంతి కార్యక్రమానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP, డి.వి. శ్రీనివాసరావు అన్నారు. కెరామెరి మండలం జోడెన్ ఘాట్ గ్రామంలో గురువారం జరగనున్న భీమ్ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి సీతక్క రానున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 460మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 17న పబ్లిక్ హాలిడేగా ప్రకటించినట్లు ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని ఈ హాలిడే ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్9వ తేదీన రెండవ శనివారం పని దినంగా పాటించాలని సూచించారు.
మంచిర్యాల పట్టణంలోని MLA ప్రేమ్ సాగర్ రావు ఇంట్లోకి ముగ్గురు దుండగులు చొరబడిన ఘటన కలకలం రేపింది. పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి ముసుగు ధరించి రాముని చెరువు కట్ట మీదుగా MLA
ఇంట్లో ప్రవేశించారు. అక్కడ ఉన్న వాచ్‌మెన్‌పై దాడి చేయబోగా అతడు అప్రమత్తమై కేకలు వేయడంతో పారిపోయారు. చొరబడిన వ్యక్తులు మారణాయుధాలతో వచ్చినట్లు వాచ్ మెన్ తెలిపారు.
చాలకాలంగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదానికి కారణమైన గాదిగూడ ఎస్ఐ మహేశ్‌పై కేసు నమోదైంది. వివరాలు ఇలా.. ఈ నెల 11న లోకారి గ్రామం వద్ద షేక్ అతిఖ్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా SI తన కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతిఖ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతని కుటుంబీకులు శనివారం ఆదిలాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. న్యాయం చేయాలని కోరారు. సోమవారం నార్నూర్ సీఐ రహీం పాషాకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రేచిని గ్రామంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మబ్బులు హనుమంతుని రూపంలో కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆ దృశ్యంలో ఆంజనేయుడు శంఖం ఊదినట్లుగా కనిపించింది. దీంతో పలువురు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకొన్నారు.
ఇకపై రోజుకు 2.4లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్క ఉద్యోగి, అధికారి పాత్ర చాలా కీలకమని సింగరేణి C&MDబలరాం అన్నారు. అన్ని ఏరియాల GMలతో C&MDవీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. CMD మాట్లాడుతూ..కంపెనీ నిర్దేశించుకున్న ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.