Adilabad

News March 26, 2024

దస్తురాబాద్: పాము కాటుతో యువకుడు మృతి..!

image

పాము కాటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన దస్తురాబాద్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొడిసెర్యాల గోండుగూడెంకు చెందిన మెస్రం భుజంగరావు(26)కు ఈనెల 18న పాము కాటేసింది. అయితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేకపోవడంతో ఆకొండపేట్‌లో నాటు వైద్యం తీసుకుంటున్నాడు. సోమవారం పరిస్థితి విషమించడంతో నిర్మల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News March 26, 2024

ఆదిలాబాద్‌లో పండుగ పూట 9 మంది మృతి

image

ఉమ్మడి ADB వ్యాప్తంగా హోలీ పండుగ రోజు 9మంది మృతి చెందారు. హోలీ ఆడి స్నానానికి వెళ్లిన నలుగురు వార్థా నదిలో మునిగి మృతి చెందారు. దండెపల్లిలోని గూడెం లిఫ్ట్ కాలువలో పడి కార్తీక్.. వాగులో పడి ADBకి చెందిన హర్షిత్, సారంగాపూర్‌కి చెందిన పెద్ద ఎర్రన్న మరణించారు. నిర్మల్‌కు చెందిన జాదవ్ గణేశ్ ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుతో చనిపోగా.. బెల్లంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు.

News March 25, 2024

పండగపూట తీవ్ర విషాదం.. వార్ధా నదిలో నలుగురు గల్లంతు

image

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధ నదిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు నదీమాబాదుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుల కోసం రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

News March 25, 2024

మంచిర్యాల: పండగపూట విషాదం.. ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి గ్రామానికి గోపులాపురం కార్తీక్( 22) అనే యువకుడు గూడెం లిఫ్ట్ కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్ స్వస్థలం జన్నారం మండలం ధర్మారం గ్రామం కాగా హోలీ పండుగకు తన తాత ఇంటికి వచ్చాడు. గూడెం లిఫ్ట్ కాలువలోకి ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2024

ADB: వామ్మో మార్చిలోనే భగభగ

image

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలకు రోజురోజుకు పెరుగుతూ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మార్చి నెలలోనే భానుడి ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనాలు ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. గరిష్ఠంగా నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో గరిష్ఠంగా 41.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గాలిలో తేమశాతం గణనీయంగా పడిపోయి ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్నారు.

News March 25, 2024

కడెం: పోలీసు డ్రెస్ వేసుకొని చోరీ

image

పోలీసు డ్రెస్ వేసుకొని ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలోని HP పెట్రోల్ బంకులో ఆదివారం రాత్రి కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగతనం చేసి అనంతరం లక్కీ దాబాలో దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

News March 25, 2024

MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి చేరువలో నీటి నిల్వలు

image

ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 20. 175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8. 80 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటిమట్టం 148 మీటర్లకు గాను 142. 90 మీటర్లుగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే యాసంగి సాగుతో పాటు తాగునీటికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి.

News March 25, 2024

ADB: ఈనెల 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం

image

కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ చదువుతున్న రెగ్యులర్, బ్యాక్ లాక్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం తెలిపారు. సెమిస్టర్-2, 4, 6 విద్యార్థులు ఈ ఫీజును చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

News March 25, 2024

మంచిర్యాల: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

image

పెళ్లి సంబంధం కుదరడం లేదని, తనకు ఇక పెళ్లి కాదని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. S Iమహేందర్ వివరాల ప్రకారం.. మంచిర్యాల రాజీవ్ నగర్ కు చెందిన గ్రీష్మాసాయి (25) హైదరాబాదులో PG చదువుతోంది. గ్రీష్మాకు నాలుగేళ్లుగా వారి కులదైవం పేరుతో పూనకం వస్తుంది. ఈ కారణంగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. ఈ క్రమంలో సెలవులపై గ్రీష్మ ఇంటికి వచ్చింది. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది.

News March 25, 2024

ADB: కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ..!

image

కాంగ్రెస్ పార్టీలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక అయోమయంగా మారింది. రోజుకో పేరును తెరపైకి తీసుకువస్తున్న అధిష్ఠానం ఎవరి పేరునూ ఖరారు చేయకపోవడంతో నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. అభ్యర్థి ఎంపిక ప్రహసనంగా మారడంతో పార్టీల చర్చకు దారి తీసింది. తమ ప్రాంతాల్లో తామే అభ్యర్థినంటూ కొందరు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.