Adilabad

News October 6, 2024

గాంధీ ఆస్పత్రి నుంచి జైనూరు ఆదివాసి మహిళ డిశ్ఛార్జ్

image

ఆటో రిక్షా డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జైనూరుకు చెందిన ఆదివాసి మహిళ ట్రీట్మెంట్ గాంధీలో పూర్తి కావడంతో కాసేపటి క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆమెను పరామర్శించారు. అలాగే కొంత నగదు, దుస్తులను అందజేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

News October 5, 2024

లోకేశ్వరం: విష జ్వరంతో మహిళ మృతి

image

విష జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం లోకేశ్వరం మండల కేంద్రంలో
చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని లోకేశ్వరం గ్రామానికి చెందిన సిరిపెల్లి గంగామణి 34 జ్వరంతో బాధపడుతూ
లోకేశ్వరంలో డాక్టర్‌ను సంప్రదించిన నయం కాకపోవడంతో నిర్మల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.

News October 5, 2024

ADB: గ్రేట్.. ఒకేసారి మూడు ఉద్యోగాలు

image

ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓరగంటి ప్రశాంత్ ప్రభంజనం సృష్టించాడు. పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓరగంటి రాజన్న, విజయ దంపతుల కుమారుడు ప్రశాంత్(32) ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో SA(సోషల్), LP(తెలుగు)తో పాటు SGT ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. కష్టపడి చదివి మూడు ఉద్యోగాలు సంపాదించడంతో ఆయన్ను పలువురు అభినందించారు.

News October 5, 2024

ఆదిలాబాద్: ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు గడువు పెంపు

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై గడువు పొడగించినట్లు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని సూచించారు. SEP 30 వరకు గడువు పూర్తవగా దాన్ని OCT 15 వరకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
>>SHARE IT

News October 5, 2024

ఆదిలాబాద్: వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

నిరక్షరాస్యులైన వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కార్యక్రమాన్ని రూపొందించిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 15 ఏళ్లుపై బడిన నిరక్షరాస్యులను గుర్తించి ఐదు దశల్లో వారికి శిక్షణా నిచ్చి అక్షరాస్యులుగా తీర్చదిద్దాలన్నారు.

News October 4, 2024

నిర్మల్ : నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణను అందించాలి: కలెక్టర్

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందేలా వృత్తి నైపుణ్య శిక్షణలను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు శిక్షణపై జిల్లాస్థాయి వృత్తి నైపుణ్య సొసైటీ ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేలా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించాలని ఆదేశించారు.

News October 4, 2024

బాసర: ‘సరస్వతి దేవిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్’

image

బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యురాలు కుస్రం నీలాదేవి శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

News October 4, 2024

ఆదిలాబాద్: ఏకంగా భాష నేర్చుకుని జాబ్ కొట్టింది..

image

ఉట్నూరు మండలం లక్కారం మసీదు ఏరియాలో నివాసముండే న్యాయవాది పవార్ వసంత్ కూతురు మౌనిక డీఎస్సీ ఉర్దూ మాధ్యమంలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ఇంటి చుట్టూ ఉన్న ముస్లింలతో ఉర్దూ భాషలో మాట్లాడటం చేసుకున్న ఆ యువతికి ఆ భాషే చివరకు ఉద్యోగాన్ని సాధించిపెట్టింది. ఎస్టీ విభాగంలో రెండు పోస్టులు రిజర్వు చేయడంతో ఆమెకు ఉద్యోగం దక్కడం లాంఛనమే. ఉర్దూ భాషను మిత్రులతో పాటు యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నట్లు మౌనిక తెలిపారు

News October 4, 2024

ఆదిలాబాద్: వెబ్ అప్షన్స్ పెట్టుకోవడానికి నేడే LAST

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీజీ M.A ఎకనామిక్స్ M.Com రెగ్యులర్ కోర్సులలో రెండవ విడతలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈనెల 4వ తేదీవరకు గడువు ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం కోఆర్డినేటర్ చంద్రకాంత్ తెలిపారు. CPGET రాసిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఇతర వివరాలకై కళాశాలను సంప్రదించాలని కోరారు.

News October 4, 2024

ఆదిలాబాద్: ఈనెల 5న అంతర్జాతీయ ఉద్యోగ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 5న అంతర్జాతీయ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ, ఉద్యోగ, శిక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 21 నుంచి 41 ఏళ్లలోపు ఉండి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులన్నారు.