India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్యాన్సర్ వ్యాధితో పదోతరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన పులనేని గంగయ్య-కవిత దంపతుల కుమారుడు చరణ్ స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కాగా విద్యార్థి గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాలుడు మంగళవారం మృతిచెందాడు. చిన్నవయసులోనే అనారోగ్యంతో మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

కెరామెరి మండలం జోడేఘాట్ అడవుల్లో పులి సంచరిస్తుందని జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ మంగళవారం నిర్ధారించారు. గత రెండు రోజుల క్రితం ఉట్నూర్, నార్నూర్ అడవుల్లో పశువులపై దాడి చేస్తూ సంచరిస్తున్న పెద్దపులి జోడేఘాట్ అడవిలో పాదముద్రలను అధికారులు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కెరామెరి జోడేఘాట్ అడవుల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన క్యాతం రాజేశం కూతురు క్యాతం దీపిక ఇటీవల రెవెన్యూ శాఖలో గ్రూప్ -4 ఉద్యోగం సాధించారు. కాగా ఆమెను సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు అభినందించారు. అంకిత భావంతో పనిచేయాలని, ప్రజలకు అన్నివేళలా సహకరించాలని కోరారు. పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తే సాధించనిది ఏదీ లేదని అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలంలోని రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదాస్పద గ్రామాలు పరందోలి, అంతాపూర్, ఇంద్రనగర్, మహారాజ్ గుడ్డతో పాటు సరిహద్దులో గల 12 గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా వారు రాజురా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకుంటారు. వార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఇద్దరు చొప్పున ప్రజాప్రతినిధులు ఉంటారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన అనిత (42) స్థానిక తాంసి రైల్వే గేట్ వద్ద వెళ్తుండగా గుర్తు తెలియని టిప్పర్ లారీ ఆమె కాళ్ల పై నుంచి వెళ్లింది. దీంతో ఆమె ఒక కాలు నుజ్జు నుజ్జు అయి తీవ్ర గాయాల పాలయింది. గమనించిన స్థానికులు అంబులెన్స్లో ఆమెను రిమ్స్‌కు తరలించారు.

బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేసి సింగరేణి సంస్థకే బొగ్గు గనులు కేటాయించాలని, సంస్థ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సింగరేణి కార్మికునిపై ఉందని సీపీఎం పిలుపునిచ్చింది. సింగరేణి సంస్థకు కేటాయించాల్సిన బొగ్గుగలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకెరవి, జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ అన్నారు.

ఉట్నూర్‌లో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం రాత్రి ఉట్నూర్, నార్నూర్ మధ్యలో పెద్దపులి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించింది. ఒక్కసారిగా రోడ్డుపై పెద్దపులి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కొంతమంది దాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అయితే ఇప్పటికే పలు మండలాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు.

చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని చదివించింది. తల్లి కష్టానికి ప్రతిఫలంగా ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. బెల్లంపల్లి మండలం చిన్న బూదలోని రవీంద్రనగర్‌కు చెందిన మిట్టపల్లి రవికుమార్, శ్రీధర్ అన్నదమ్ములు. వీరిలో రవికుమార్ ఇప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా, శ్రీధర్ ఇటీవల గ్రూప్- 4లో మంచిర్యాల కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ సాధించాడు.

బొగ్గు బ్లాక్‌ల వేలం పాట రద్దు చేసి సింగరేణి సంస్థకే బ్లాక్‌లను కేటాయించాలని చెన్నూరులో CPMఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఏరియా కార్యదర్శి చందు, జిల్లా నాయకురాలు రాజేశ్వరి మాట్లాడుతూ..మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJPప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు ఇవ్వడం కోసం బొగ్గు బ్లాక్‌ల వేలం నిర్వహిస్తోందన్నారు.

ఉట్నూరు మండలంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో బీర్సాయిపేట్, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీర్సాయిపేట్ అటవీశాఖ అధికారులు కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో పెద్దపులి సంచార సమాచారం ఉందన్నారు. బీర్సాయిపేట్, పరిసర గ్రామాలతో పాటు నార్నూర్,జైనూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పులికి ఏ హాని తలపెట్టవద్దని, నష్టం జరిగితే అటవీశాఖ నష్టపరిహారం ఇస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.