Adilabad

News March 18, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్ @2111 పోలింగ్ కేంద్రాలు

image

ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎస్టీ-1 కాగా.. మూడు జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, మథోల్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ ఉండగా.. ఇందులో 16,44,715 మంది ఓటర్లు ఉన్న ట్లు ఎన్నికల అధికారి రాజర్షి షా వివరించారు. పురుషులు 8,02,575.. మహిళలు, 8,42,054, ఇతరులు 86, 2,085 మంది సర్వీస్‌ ఓటర్లు ఉండగా 2,111 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News March 18, 2024

ADB: నిండు ప్రాణాన్ని బలిగొన్న చిన్నపాటి గొడవ

image

మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదిలాబాద్‌కు చెందిన రాజు (30), సాగర్ ఓ వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం అక్కడే ఉన్న వినోద్, ప్రవీణ్‌లతో వారు గొడవపడ్డారు. దీంతో వినోద్, ప్రవీణ్ లు వారిని వెంబడించి టీటీడీ సమీపంలో దాడి చేశారు. ఈ దాడిలో రాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, సాగర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

News March 18, 2024

నిర్మల్: ప్రియురాలితో గొడవ.. యువకుడు సూసైడ్

image

ప్రియురాలితో గొడవ పడిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుంటాలలో
జరిగింది. ఏఎస్సై దేవ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండం శ్రీకాంత్‌ (20) అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాదిగా ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం వారిద్దరూ గొడవపడ్డారు. దీంతో క్షణికావేశంలో యువకుడు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News March 18, 2024

ASF:’ ముచ్చటగా మూడోసారి ఆయనే’

image

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే వస్తుందని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కాగజ్ నగర్ మండలం రాంనగర్ గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇచ్చేందుకు యావత్ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News March 18, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి రద్దు

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించనున్నారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News March 17, 2024

తానూర్‌లో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

మండలంలోని ఉమ్రి (కె) గ్రామానికి చెందిన కదం బాలాజీ (35) ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మృతుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 17, 2024

వాంకిడి: సైబర్ వలలో చిక్కి మోసపోయిన వ్యక్తి

image

మండలంలోని పిప్పర గొంది గ్రామానికి చెందిన రాథోడ్ చంద్రకాంత్ సైబర్ వలలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో కారు ధర తక్కువగా ఉన్నదని ప్రకటన రావడంతో రూ.1,43,000 చెల్లించినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. వారి నుంచి ఎలాంటి సమాదానం రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

News March 17, 2024

మంచిర్యాల: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి

image

మంచిర్యాలలోని లక్ష్మీ నగర్‌లో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్న వహిదా అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. సోమవారం తలనొప్పి ఉన్నట్లు ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోలేదని, పరిస్థితి విషమించడంలో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం HYDలోని నిమ్స్‌కి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News March 17, 2024

గేట్ ఫలితాల్లో ఆదిలాబాద్ వాసికి ఆల్ ఇండియాలో ర్యాంక్

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ప్రతిభను కనబర్చారు. పట్టణంలోని జై జవాన్ నగర్ కాలానికి చెందిన సుంకరి నవీన్ ఆల్ ఇండియాలో 1833 ర్యాంక్ సాధించారు. 38.33 మార్కులు సాధించి క్వాలిఫై అయ్యాడు. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్టుల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.

News March 17, 2024

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 15నెలల చిన్నారి మృతి

image

రోడ్డు ప్రమాదంలో 15నెలల చిన్నారి మృతి చెందిన ఘటన దిలావర్‌పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అబ్దుల్‌సాదిక్, అనయాకు 15నెలల కూతురు ఉంది. శనివారం గ్యాస్ ఏజెన్సీ వాహనం సిలిండర్ల పంపిణీకి వెళ్తుంది. ఈక్రమంలో చిన్నారి ఇంట్లో నుంచి బయటకి రావడంతో వేగంగా వస్తున్న వాహనం తల పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నట్లు SI తెలిపారు.