India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాకతీయ యూనివర్సిటీలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను KU అధికారులు మంగళవారం విడుదల చేశారు. 1, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 26 నుంచి, 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1, 5వ సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య విచ్చేశారు. ముందుగా ఉట్నూర్‌లో ఆయన పర్యటించగా ITDA PO ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలదేవి దేవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జరుగుతున్న కుటుంబ సర్వేను పరిశీలించారు. అలాగే ఉట్నూర్ మండలం బిర్సాయిపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామస్థులు మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమగ్ర సర్వేకు సహకరించమని చెప్పారు.

చదువుకు పేదరికం అడ్డుకాదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్లగొండ గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం అశోక్ మున్నాభాయ్ దంపతుల కుమార్తె శ్రీ తేజకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రూ.50 వేల చెక్కును అందజేశారు. తీన్మార్ మల్లన్నకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తీరుపై ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, సూపరవైజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు క్షేత్ర స్థాయిలో సర్వేను పరిశీలించాలని సూచించారు.

నిర్మల్ జిల్లా బాసర IIITలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. కాగా స్వాతి ప్రియ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TUTF) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని మహాసభల అనంతరం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఏ.మురళీమోహన్ రెడ్డి, అధ్యక్షుడిగా తుమ్మల లచ్చిరాం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దామెర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పి.రఘునందన్ రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా గోపాల్ ఎన్నికయ్యారు. వీరికి ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

జన్నారం మండలంలోని ఇందన్పల్లి జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ టెన్త్ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ పాఠశాలలో 1998-89 సంవత్సరంలో టెన్త్ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. నాడు తమకు పాఠాలు బోధించిన గురువులను వారు శాలువాలు కప్పి సన్మానించారు అనంతరం తమ పాత జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు.

మద్యం మత్తులో వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన ఆర్.నాగన్న (40) మద్యానికి బానిస అయ్యాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మద్యం మత్తులో స్థానిక సుంకిడి బ్రిడ్జి పై నుంచి నీటిలో దూకడంతో మునిగి చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాడు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వజాతీయ స్థాయి SGF జూడో పోటీల్లో కాంస్య పతకంతో మెరిశాడని జూడో కోచ్ రాజు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవడం పట్ల పలువురు క్రీడా సంఘాల బాధ్యులు అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.