India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని గోలేటి గ్రామ శివారులో ఆదివారం కుక్కల దాడిలో జింక దుప్పి మృతి చెందింది. గమనించిన వాహనదారులు గ్రామస్థులకు తెలియజేశారు. అనంతరం గ్రామ ప్రజలు జింక మృతదేహాన్ని పరిశీలించి అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్ లో సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రికెట్ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్ మొదలుపెడుతామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు తెలిపారు. ఉచితంగానే ఈ క్యాంప్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివరాలు:
ఆదిలాబాద్: 94402 07473
మంచిర్యాల: 94400 10696
సిర్పూర్: 94923 33333
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న లారీ అదుపుతప్పి శనివారం రాత్రి సీతాగొంది గ్రామంలోని జాతీయ రహదారి పక్కనే ఓ చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అజ్మీర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన ఈఎంటీ రాజ్ కుమార్, పైలట్ ముజఫర్ ఘటన స్థలానికి చేరుకుని బాధితులను రిమ్స్‌కు తరలించారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద శనివారం పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 13,50,000 నగదు పట్టుబడినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. ఎలాంటి నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలతో డీఎంహెచ్ఓ డాక్టర్ సుబ్బరాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమచికిత్స కేంద్రం అని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి బెడ్స్, శాంపిల్స్ మెడిసిన్ ఉండవద్దన్నారు. పరిమితికి మించి వైద్యం చేయరాదని, ఎలాంటి యాంటిబయాటిక్స్ వాడరాదని సూచించారు. నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బానోత్ అక్షయ్ మృతి చెందారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే ఆయన తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.
నిర్మల్ జిల్లా బైంసా మండలం బాబుల్ గావ్ గ్రామస్తులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్న కలెక్టర్ ఆదేశాలు కూడా
అధికారులు లెక్కచేయడం లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామంలో నీటి సమస్య ఉన్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పక్క గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 5 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు పార్టీల అభ్యర్థులు ఆత్రం సుగుణ, గోడం నగేశ్, ఆత్రం సక్కు గ్రామాలలో పర్యటిస్తూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.
ఉమ్మడి ADB జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే గత ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ADB లోక్ సభ పరిధిలోని 2111 పోలింగ్ కేంద్రాలలో 16,44,715 మంది ఓటర్లకు చోటు దక్కగా.. పెద్దపల్లి పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లాలో 754 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,47,646 మంది ఓటర్లకు చోటు లభించింది. అయితే ఈ నెల 15 వరకు ఓటరు నమోదు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
Sorry, no posts matched your criteria.