Adilabad

News November 9, 2024

ఉట్నూర్: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. కాగా జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఉట్నూర్‌లోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చని ఐటీడీవో పీవో ఖుష్బు గుప్తా వెల్లడించారు.

News November 9, 2024

ASF: ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

image

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కెరమరి మండలం దేవాపూర్, అనార్‌పల్లి, తుమ్మగూడ జీపీల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి, కాగజ్ నగర్ మండలం కోసిని జీపీలో పాటు మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

News November 8, 2024

ADB: సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 9 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సంబంధిత సర్వే నిర్వహిస్తున్న మండల టీమ్‌లతో శుక్రవారం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో ఎక్కడ కూడా పొరపాట్లకు, తప్పులకు తావివ్వకుండా సరైన సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు.

News November 8, 2024

నిర్మల్ : మత్తు పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలే : ఎస్పీ జానకి షర్మిల

image

నిషేధిత మత్తు పదార్థాలను వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు మండలాల వారీగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గంజాయి తదితర మత్తు పదార్థాలను వినియోగిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 8, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచిర్యాల ఎమ్మెల్యే

image

సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదారాబాద్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తోందని తెలిపారు.

News November 8, 2024

MRML: వరకట్న వేధింపులతో భార్య సూసైడ్.. పురుగుల మందు తాగిన భర్త

image

నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ లింగంపల్లిలో <<14555090>>భర్త వేధింపులు భరించలేక వికాసిని ఆనే మహిళ<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి భర్త నవీన్ అదనపు కట్నం కోసం కోన్నిరోజులుగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన వికాసిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న నవీన్ ఆందోళక గురై పురుగు మందు తాగాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News November 8, 2024

ADB: వార్డు సభ్యుడిగా చేయాలన్నా పోటీనే!

image

కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి 2,3 నెలలు సమయం పట్టే అవకాశముండగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పలు కారణాలతో గతంలో పోటీ నుంచి చేయనివారు వారు ఈసారి సై అంటున్నారు. సర్పంచ్ సంగతి పక్కన పెడితే వార్డు సభ్యుడిగా చేయాలన్నా కొన్ని చోట్ల పోటీ ఉంది. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ దక్కించుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది?

News November 8, 2024

బెల్లంపల్లి: ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

image

బెల్లంపల్లి పట్టణం స్థానిక రైల్వే రడగంబాలబస్తి శ్రీ దుర్గాదేవి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ పాల్గొన్నారు. అనంతరం ఎండీ అంజాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన గార్వి షరీఫ్ విందులో పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

News November 7, 2024

ఆదిలాబాద్ : OPEN పీజీ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండో సంవత్సర ఫలితాలు విడుదలైనట్లు అదిలాబాద్ సైన్స్ కళాశాల ఇన్‌ఛార్జీ ప్రిన్సిపల్ జగ్రామ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో పరీక్షలు రాసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఫలితాల కోసం ఈ https://www.braouonline.in/PG/Application/PG_EXAMINATIONSTATEMENT/PG_Resutls_Login.aspx# వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

News November 7, 2024

ADB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.