India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జైపూర్ మండలంలో దారుణం జరిగింది. 2వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వైద్య సురేశ్.. తన ఇంటి ముందు ఉన్న 2వ తరగతి చదువుతున్న చిన్నారికి ఐస్ క్రీం కొనిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బుగ్గ దేవాలయంలో తేనెటీగలు భక్తులపై దాడి చేశాయి. సోమవారం దేవాలయంలో హనుమాన్ భక్తులు వంట చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో హనుమాన్ భక్తులు పరుగులు తీశారు. కొంత మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.
రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన రజిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెబ్బెన ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాసిగాం గ్రామానికి చెందిన శంకర్‌తో 2019లో రజితకు వివాహమైంది. పిల్లలు కలగడం లేదని శంకర్ మద్యం సేవించి తరుచూ రజీతను మానసికంగా వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన రజిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
చెన్నూరులో ఆదివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి విందులో కత్తి పోట్లు కలకలం రేపాయి. పెళ్లిలో పలువురి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో వారు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో 24,మార్చి 2024 నాటికి మొత్తం ఓటర్లు 16,44,715 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 8,42,575, పురుషులు 8,42,054 మంది ఉన్నారు. పురుషులకంటే 521 మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో మహిళ ఓటర్లే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు.
కాసిపేట మండలంలోని చిన్న ధర్మారంలో ఓ
ఇంటి ముందు కొబ్బరికాయ, పసుపు కుంకుమ, నల్లతాడు, బొమ్మ పెట్టడంతో గ్రామస్థులు భయాందోళనకు గురైయ్యారు. కొందరు వ్యక్తులు కావాలని చేతబడి చేశారని సదరు ఇంటి యజమాని పేర్కొన్నారు. కాగా కొందరు వ్యక్తులు కావాలని ఈ పనికి పాల్పడినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్ 44.4, మంచిర్యాల 43.5, నిర్మల్ 42.2, ఆదిలాబాద్ 40డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ జన్నారంలో ఆదివారం వర్షం కురిసింది. మండలంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. కాగా, ఈ అకాల వర్షాలతో మామిడి, మొక్కజొన్న రైతులు పంట నష్టపోయామని వాపోతున్నారు.
మహిళ ఉద్యోగితో బూట్లు కడిగించిన ఘటన మందమర్రి ఏరియా కేకే 5 గనిలో జరిగింది. గని కార్యాలయ సూపరింటెండెంట్ అదే ఆఫీస్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగితో తన బూట్లు కడిగించాడు. ఆ అధికారి తీరుతో కలత చెందిన ఆమె ఈ విషయాన్ని పలువురు కార్మికసంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నుంచి నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సందర్బంగా ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లాలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామానికి చెందిన షెక్ ఇసా(45) తాగుడుకు బానిసై మద్యం మత్తులో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.