India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పులి దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన బెజ్జూర్ రేంజ్‌లో ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూరు మండలం పెద్ద సిద్దాపూర్ గ్రామానికి చెందిన గుర్లె శంకర్ ఆవు శనివారం ఉదయం సిద్దాపూర్ అటవీ ప్రాంతానికి మేతకు వెళ్ళింది. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. సంఘటన స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి జైనథ్ వైపు వెళ్తున్న ఆటో.. తర్నం బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న భరత్‌కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందగా పుష్ప, పద్మా అనే మహిళలకు గాయాలయ్యాయి. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ సాయినాథ్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో BJP, BRSలను ఓడించాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని అన్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
మందమర్రి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రామన్ కాలనీ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఆర్కేపీ ఓసిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న పాయల వెంకటేశ్వర్లు (53) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మందమరి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి తన బైక్ పై వస్తుండగా ఒకసారి అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు గాయం కావడంతో సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడాదితో పోల్చితే 5 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. ఆదిలాబాద్‌లో రూ.385.58, ఆసిఫాబాద్‌లో రూ.269.99, మంచిర్యాలలో రూ.703,6, నిర్మల్‌లో రూ.448.83 లక్షల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మొత్తం గతేడాది రూ.1,716.60కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడు రూ.1,807.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాలలో అత్యధిక అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.
బాసర మండలంలోని ఓ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న చింతామణి గణపతి ఆలయంలోని నాగదేవత, నందీశ్వరుని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. ఉదయం పూట ఆలయాన్ని శుభ్రం చేసే మహిళ ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుకలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం గరిష్ఠంగా మంచిర్యాల జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 41, ఆదిలాబాద్ 42.4, నిర్మల్ 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నేరడిగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి అత్యాచారయత్నం చేసినట్లు ఏఎస్ఐ మారుతి తెలిపారు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం చేయగా బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పరారైనట్లు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ADB జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బహుజనులు శాశ్వత బానిసలు అవుతారన్నారు. BSP తోనే బహుజనులకు రాజ్యాధికారం లభిస్తుందన్నారు. జిల్లా నాయకులు రత్నపురం రమేష్, జంగుబాపు, తదితరులున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షెట్టిపేట రికార్డు స్థాయిలో 91.44 శాతం మున్సిపాలిటీ పన్నులు వసూలు చేసింది. రాష్ట్రంలోనే ఈ మున్సిపాలిటీ టాప్-8లో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో లక్షెట్టిపేట మొదటిస్థానంలో ఉండగా, భైంసా 47.29 శాతంతో రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. మంచిర్యాల 68.45 శాతం, ఆదిలాబాద్ 64.23 శాతం, నిర్మల్ 53.24, బెల్లంపల్లి 50.79, ఖానాపూర్‌లో 49% మాత్రమే పన్ను వసూళ్లు అయ్యాయి.
Sorry, no posts matched your criteria.