India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లి కావడం లేదని యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన బోథ్ మండలంలో జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని కొత్తగల్లికి చెందిన జాదవ్ జ్ఞానేశ్వర్ (21)కు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూసినప్పటికీ కుదరక పోగా మనస్తాపంతో ఇవాళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి విషయం చెప్పింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి శివారులోని అంతర్రాష్ట్ర రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పిప్పల్ గావ్‌కు చెందిన భోపాల్, ఈశ్వర్, అంకుశ్ బైక్‌పై ఉపాధి కోసం సుంకిడికి బయలుదేరారు. ఎదురుగా వస్తున్న మ్యాక్స్ పికప్ ఢీకొట్టింది. గమనించిన స్థానికులు ముగ్గురిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ముందస్తు ఇంటి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీ కల్పించినట్లు మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి 2025 వరకు ఇంటి పన్ను మొత్తం ఈ నెల 30లోపు ముందస్తుగా చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
మంచిర్యాల జిల్లానెన్నెల మండలంలోని కంబాల కుంట మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి మండలానికి చెందిన బలరాం(38) మృతిచెందగా, లంబడి తండాకు చెందిన నవీన్ తీవ్రంగా గాయపడ్డారు. శుభకార్యంలో పాల్గొని బెల్లంపల్లికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నవీన్ మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మహారాష్ట్రకు చెందిన బృందంతో పాటు జిల్లాలోని మూడు అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్ల సాయంతో ఏనుగు జాడను గుర్తించాయి. శుక్రవారం ఉదయం కమ్మర్గాంలోని పల్లె ప్రకృతి వనంలో స్థానికులకు ఏనుగు కనిపించింది. సాయంత్రం మొర్లి గూడ అటవీ సమీపం నుంచి ప్రాణహిత నది తీరం దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లినట్టు డ్రోన్ కెమెరా ద్వారా నిర్ధారించుకున్నట్లు ఇన్‌ఛార్జ్ FRO సుధాకర్ తెలిపారు.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లె పోశం తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 2న పోశంకు భార్యతో గొడవ జరగాగ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పోశం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తపాలా శాఖ IPPB (ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు)లో జరిగిన అక్రమాల తీరుపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లోని 74 మంది రైతులకు చెందిన పత్తి పంట విక్రయాల తాలూకూ డబ్బులను వారి ఖాతాల నుంచి తన సొంత ఖాతాల్లోకి అక్రమంగా మళ్లించుకున్నట్లు తేల్చారు. ఇలా రూ.1.16 కోట్లు ఆయన స్వాహా చేసినట్లు తేల్చారు.
2023 డిసెంబరులో నిర్వహించిన కేయూ డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి/బిబిఎ/హనర్స్/వొకేషనల్) 1వ, 3వ,5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ రమేశ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24.41% ఉత్తీర్ణత, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 30%, 5వ సెమిస్టర్ పరీక్షల్లో 44.45% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వివరాలకు www.kakatiya.ac.inలో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీలో బెల్ట్ షాపులపై టూటౌన్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు గణపతి, సుధాకర్, రాజు ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. తొమ్మిది రకాల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ రూ.14 వేల 490 ఉంటుందన్నారు. ఎస్సై లాల్ సింగ్ నాయక్, సిబ్బంది నరేష్, కిషన్, హరి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.