Adilabad

News April 5, 2024

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదం.. వృద్ధునికి తీవ్ర గాయాలు

image

ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి. చాందా (టి) గ్రామ సమీపంలో శుక్రవారం రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న 70 ఏళ్ల వృద్ధుడు రాందాస్‌ను ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాందాస్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన ఈఎంటీ కిషన్, పైలెట్ ముజఫర్ లు క్షతగాత్రుణ్ని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

News April 5, 2024

జైనథ్: బీఆర్ఎస్ పార్టీకి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజీనామా

image

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివప్రసాద్ రెడ్డి శుక్రవారం తెలిపారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీకి చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి తనకు మార్కెట్ కమిటీలో స్థానం కల్పించినందుకు మాజీ మంత్రి జోగురామన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News April 5, 2024

నిర్మల్: 62 మందికి షోకాజ్ నోటీసులు

image

నిర్మల్‌లోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం విధులకు రావాల్సిన స్పెషల్ అసిస్టెంట్లు 62 మంది గైర్హాజరయ్యారు. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. మూల్యాంకనానికి విధులు కేటాయించబడ్డ ఉపాధ్యాయులు రేపటిలోగా (శనివారం) హాజరుకావాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 5, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు సంచారం

image

ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 120 మంది సిబ్బందితో ట్రాకింగ్ నిర్వహిస్తున్నారు. థర్మల్ డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అడవిలో సంచరిస్తున్న ఏనుగును కెమెరాలో బంధించారు. ఇప్పటికే జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు అటవీ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.

News April 5, 2024

ADB: ఎన్నికల విధుల్లో 10,489 మంది ఉద్యోగులు

image

ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో విధులు నిర్వహించాల్సిన ఎన్నికల ఉద్యోగులకు ఇప్పటికే తొలి విడత శిక్షణ పూర్తి కాగా వారంతా పోస్టల్ బ్యాలెట్‌ వినియోగించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోని 2,111 పోలింగ్‌ కేంద్రాలకు మొత్తం 10,489 మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఇందులో 55 ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఎంపిక చేశారు. ఎన్నికల నిర్వహణలో వీరంతా భాగస్వాములు కానున్నారు.

News April 5, 2024

ADB: బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి నియామకం ఎప్పుడు..?

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఇప్పటికే MP అభ్యర్థులను ప్రకటించాయి. వారితో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా BJP.. MLA పాయల్ శంకర్‌ను, కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్కను నియమించింది. BRS పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదు. ఒకవైపు జోగు రామన్న పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈనెల 5 తర్వాత ఈ విషయంపై స్పష్టత రావచ్చని సమాచారం.

News April 5, 2024

మంచిర్యాలలో ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెండ్

image

మంచిర్యాలలోని కార్మల్ కాన్వెంట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. అయితే మొదటి రోజు విధులకు కారణం లేకుండా గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సదురు ఉపాధ్యాయులను వివరణ కోరగా వారు స్పందించకపోవడంతో డీఈవో యాదయ్య వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

News April 4, 2024

మంచిర్యాల: శాంతిఖని గనిలో ప్రమాదం

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికుల వివరాల ప్రకారం.. గని మెయిన్ రైడింగ్ ఛైర్ లిఫ్ట్ 47L కరువు స్టేషన్ వద్ద నుంచి లెవెల్ ఛైర్ లిఫ్ట్ స్టేషన్ కు వచ్చే చైర్ జామ్ అయింది. ఉదయం షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న జనరల్ మజ్దూర్ శివకుమార్ ఆ ఛైర్ తీసే క్రమంలో కుడిచేతి రెండు వేళ్లు ప్రమాదవశాత్తు చివరి భాగాలు కట్ అయినట్లు కార్మికులు తెలిపారు.

News April 4, 2024

ఇండియా అబ్బాయి.. లండన్ అమ్మాయి.. బెల్లంపల్లిలో పెళ్లి

image

బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన యువకుడు రాజుకు లండన్‌కు చెందిన యువతి డయానకు గురువారం బెల్లంపల్లిలో వివాహమైంది. వ్యాపార రీత్యా రాజు మూడేళ్ల క్రితం లండన్ వెళ్ళాడు. అక్కడే డయానతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరు ఒకటై హిందూ సంప్రదాయం ప్రకారం బెల్లంపల్లిలో జరిగింది.

News April 4, 2024

ASF: ఆ మండలంలో 144 సెక్షన్.. కారణమిదే..!

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేస్తూ తహశీల్దార్N. భూమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.