Adilabad

News April 4, 2024

MNCL: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్

image

మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు MNCL CI బన్సీలాల్ తెలిపారు. మార్చి 28న 10th పరీక్షలు రాస్తుండగా బాలిక కనిపించడం లేదని ఆమె తల్లి సంతారు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్(27)అనే వ్యక్తి ఆమెను బలవంతంగా వేములవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్తుండగా ఆమె తప్పించుకొని వచ్చినట్లు వెల్లడించారు.

News April 4, 2024

ASF: ఏనుగు దాడిలో మరో రైతు మృతి

image

జిల్లాలో నిన్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుపై ఏనుగు దాడి జరిగింది. కారు పోచన్న అనే రైతు ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలం వద్ద ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News April 4, 2024

ADB: పాఠశాల మౌలిక సదుపాయాల అంచనాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

అమ్మ ఆదర్శ- పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల అంచనాలను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ.. త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 4, 5 తేదీల్లో పాఠశాలల్లోని 5రకాల పనులకు సంబంధించి వాటిపనుల అంచనాలను సంబంధిత అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలన్నారు.

News April 3, 2024

ఆదిలాబాద్: తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్‌ల నియామకం

image

తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జీవన్‌పాటిల్ మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు కృష్ణ ఆదిత్యను తాగునీటిని పర్యవేక్షణ ప్రత్యేక అధికారులుగా నియమించారు.

News April 3, 2024

ADB: ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను అక్కడికి వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ ద్వారా అందజేయడం జరుగుతుందని ఆర్ఏం సులేమాన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. తలంబ్రాల కోసం ఉమ్మడి జిల్లాలోని కార్గోపార్సిల్ కేంద్రాల్లో భక్తులు ఒక ప్యాకెట్‌కు రూ.151 చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

News April 3, 2024

ASF: ఏనుగు దాడిలో రైతు మృతి

image

ఏనుగు దాడిలో రైతు మృతిచెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన అన్నూరి శంకర్ బుధవారం తన మిరపతోటలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏనుగు ఒక్కసారిగా మిరప చేనులో దిగింది. అతడిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన గురై పరుగులు తీశారు.

News April 3, 2024

ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ వివరాలు

image

ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 1952వ సంవత్సరంలో ఏర్పడింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ స్థానాన్ని ఎస్టీ రిజర్వ్‌డ్‌గా మార్చారు. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా.. మొదటి సారి సోషలిస్ట్ పార్టి, తరువాత కాంగ్రెస్ 9, టీడీపీ 5, బీఆర్ఎస్2, ప్రస్తుతం బీజేపీ నుంచి సోయం బాపురావు ఎంపీగా గెలుపొందారు.

News April 3, 2024

ADB: కిడ్నీ సమస్యతో ఖాళీ అయిన ఊరు..!

image

ADB జిల్లా భీంపూర్ మండలం గోవింద్‌పూర్‌ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు బావుల నీటినే వినియోగించేవారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత సమస్యతో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో గ్రామస్థులు ఊరిని వదిలి వెళ్లిపోయారు.

News April 3, 2024

నిర్మల్‌లో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

image

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిర్మల్ 43.5 డిగ్రీల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలో 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. జిల్లాలోని బైంసా మండలం వానల్ పాడ్, నర్సాపూర్ మండలంలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

News April 3, 2024

తాండూరు: ‘ప్రేమ పేరుతో భార్యను వేధించాడని చంపేశాడు’

image

తాండూరులోని సుభద్ర కాలనీకి చెందిన అజ్గర్ <<12972348>>హత్యకు గురైన<<>> విషయం తెలిసిందే. అతడి ఫోన్ సిగ్నల్స్ ద్వారా IBలోని ఓ కాలనీకి చెందిన దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. మార్చి 31 రాత్రి అజ్గర్‌ను ఇంటికి పిలిచి తలపై రాడ్డుతో కొట్టి గొంతు నులిమి చంపేశారు. తన భార్యను అజ్గర్ ప్రేమ పేరుతో వేధించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఆ ముగ్గురిని ASF సబ్ జైలుకు తరలించారు.