India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT
WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్-సిర్పుర్‌కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పుర్‌టౌన్ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సిక్రింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ – సికింద్రాబాద్ SEP 23 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దు చేశారు.
ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో ఎఫ్ఎం స్టేషన్లను ప్రవేశ పెట్టేందుక కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉభయ జిల్లాలో ఎఫ్ఎం రేడియో సదుపాయం రానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, సంఘాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరవేయడానికి ఎఫ్ఎం రేడియో ఉపయోగించుకోవచ్చు.
ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్ లో ఉన్న ఎస్బీఐ వారి ఏటీఎంలో చోరీకి గురువారం రాత్రి యత్నం జరిగింది. వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి స్ధానిక శాంతినగర్‌లోని ఏటీఎం అద్దాలు పగులగొట్టి చోరీ చేయటానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవటంతో వెనుదిరిగాడు. ఈ విషయమై ఎస్బీఐ రీజినల్ బ్యాంక్ ఆఫీసర్ సత్యనారాయణ శుక్రవారం పీఎస్ లో ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ తెలిపారు. జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముందని శుక్రవారం రాత్రి వరద గేట్ల నుంచి దిగువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో
నది పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.
ఇటీవల తానూర్ మండలం బెళ్తారోడా గ్రామానికి చెందిన దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం బాలికను నిర్మల్ పట్టణంలోని పాఠశాలలో చేర్పించి, బాలిక చదువుకోవడానికి అవసరమైన వస్తువులను కొనిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని బాలికకు సూచించారు. ఇందులో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి పెంట సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. PACSలో రైతులకు తెలియకుండానే వారి పేరిట రుణాలు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని, రుణాలు, నిధులు, ఎరువుల విక్రయాల నగదు సొంతానికి వాడుకున్నారని వెలుగులోకి వచ్చింది. అధికారులు కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దీంతో జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
రుణమాఫీ నగదును అప్పు ఖాతా కింద మినహాయించవద్దని, రైతులకు విధిగా నెలాఖరులోగా చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. అధికారులతో రైతు రుణమాఫీ, రుణాల క్రమబద్ధీకరణ, మహిళాశక్తి రుణాల మంజూరు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్ల వారీగా విడుదలైన మొత్తం రైతులకు ఇచ్చిన నగదు వివరాలపై ఆరాతీశారు. ఏకరూప దుస్తుల తయారీని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాధికారి శ్రీధర్, డీఆర్డీఓ సాయన్న ఉన్నారు.
జిల్లాలోని వసతిగృహాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా కు బాలల హక్కుల పరీక్షణ వేదిక సభ్యులు వినతి పత్రం అందించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, బాలికల వసతి గృహాలలో మహిళా సిబ్బందిని నియమించాలని విన్నవించారు. ఈ విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. వేదిక సభ్యులు ఎండి షాహిద్, పెందూర్ మధు, రాథోడ్ రోహిదాస్, సాంబశివరావు ఉన్నారు.
నిషేధిత గంజాయిని రవాణా, విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.