India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులకు పాఠశాల స్థాయిలో చదువుతో పాటు వృత్తివిద్య శిక్షణ కోర్సులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 29 పాఠశాలల్లో కోర్సులు అమలు చేస్తోంది. ఆదిలాబాద్ 6, కొమురం భీమ్ 7, మంచిర్యాల 12, నిర్మల్ 4 పాఠశాలల్లో కోర్సులు అమలు అవుతున్నాయి. కోర్సుల నిర్వహణకు సంబంధించి సామాగ్రి కొనుగోలుకు సంబంధించి రూ.11.62 లక్షల నిధులు విడుదలయ్యాయి.
బాలికను శారీరకంగా వాడుకొని మోసం చేసిన బాలుడిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల సీఐ బన్సిలాల్ తెలిపారు. మంచిర్యాలకు చెందిన ఓ బాలికను(17) ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి ఓ బాలుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను వేధిస్తున్నట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. రిమాండ్ నిమిత్తం బాలుడిని బుధవారం కోర్టు హాజరుపర్చినట్లు సీఐ వెల్లడించారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, CAS, RMO, CMO పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో సెప్టెంబర్ 4న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. వివరాల కోసం adilabad.telangana.gov.in, rimsadilabad.org వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ రాజర్షిషా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులతీరు, పదవతరగతికి సంబంధించి రూపొందించిన క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. డెంగ్యూ కేసులు నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, మెప్మా ద్వారా ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
ఇచ్చోడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఇందిరా మహిళ శక్తి పథకం కింద ఏర్పాటు చేస్తున్న నూతన మహిళ శక్తి క్యాంటీన్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా శక్తి పథకంతో మహిళల ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఐకేపీ వీవోఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఐకేపీ వీవోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువత గంజాయికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 242 కేసులు నమోదు కాగా, 398 మందిని అరెస్ట్ చేశారు. 1,056.64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో రూ.2లక్షల లోపు రుణం ఉండి రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు ఇన్‌ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3 విడతల్లో రుణమాఫీ అయింది. రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులను గుర్తించి వారి కుటుంబ వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇందుకోసం మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించనున్నారు.
భార్య చనిపోయిన అదే రోజు భర్త మృతి చెందిన ఘటన తానూర్‌లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన బండేవార్ పోశెట్టి (91), పెంటుబాయి (86) దంపతులు. కాగా పెంటుబాయి మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది. భార్య అంత్యక్రియలు మధ్యాహ్నం జరగగా అదే రోజు రాత్రి 10గంటలకు మనోవేదనతో ఆమె భర్త పోశెట్టి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఆసిఫాబాద్‌లో ఈనెల 29న నిర్వహించే మాజీ మంత్రి స్వర్గీయ కోట్నాక భీంరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ సభ్యులు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబును కోరారు. ఈ మేరకు ఇవాళ కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో గోండ్వాన జాతీయ నాయకులు సిడం అర్జు, మేడి మోతిరాం, సభ్యులు చిన్నయ్య, గుణ్వంతరావ్, తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.