Adilabad

News March 31, 2024

బోథ్: బంధువుల పెళ్లికి వెళ్లి… అనంత లోకాలకు

image

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన బోథ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇచ్చోడకు చెందిన పోనకంటి సుకుమార్ సాకెర గ్రామానికి దగ్గరి బంధువుల పెళ్ళికి వెళ్ళాడు. తెల్లవారితే ఇంట్లో పెళ్లి అందరూ హాల్ది ఏర్పాట్లలో ఉన్నారు.సుకుమార్ పక్కనే ఉన్న సోనాల గ్రామానికి వెళ్ళాడు.గ్రామంలోని బస్టాండ్ పరిసరాలు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News March 31, 2024

కాగజ్ నగర్: రైలు కిందపడి ఝార్ఖండ్ వాసి మృతి

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ కథనం ప్రకారం.. బిలాస్పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రైలులో ఝార్ఖండ్ రాష్ట్రం గర్వ జిల్లా తెనర్కు చెందిన దిలీప్ కుమార్ సింగ్ ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News March 31, 2024

ASF: పురుగు మందు తాగి యువకుడు మృతి

image

రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గజ్జల భీం రావ్(35) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. వారు తెలిపిన కథనం ప్రకారం.. భీమ్‌రావ్ ఏ పని చేయకపోవడంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతని భార్య పుట్టింటికి వెళ్లింది.. మద్యానికి బానిసైన భీం రావ్ ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమెకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News March 31, 2024

ADB: అక్క పెళ్లి రోజే తమ్ముడు బలవన్మరణం

image

ఉట్నూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. అక్క పెళ్లి రోజే తమ్ముడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం లక్షటిపేటకి చెందిన అర్కవినోద్(25) ఉట్నూర్‌లో డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం అక్క అర్క అనసూయ పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా నార్నూర్ వెళ్లారు. వినోద్ ఇంటి వద్దే ఉండి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడూ ఒంటరితనంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.

News March 31, 2024

ADB: ‘ఉపాద్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

image

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకొవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మంచి నీటిని అందుబాటులొ ఉంచాలని, ఎండలో ఆడుకోకుండా చూడాలన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు మధ్యాహ్నం వేళల్లో తరగతులు నిర్వహించరాదని హెచ్చరించారు.

News March 30, 2024

ADB: శిక్షణ కానిస్టేబుళ్లకు పోలీసు విధులపై అవగాహన

image

ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 257 మంది కానిస్టేబుళ్లు బేసిక్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వన్ టౌన్, టూ టౌన్, మావల, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లలో వారికి పోలీసుల విధివిధానాలపై శనివారం అవగాహన కల్పించారు. దీని కోసం 257 మంది శిక్షణ కానిస్టేబుళ్లలను ఆయా పోలీస్ స్టేషన్‌లకు కేటాయించారు.

News March 30, 2024

జన్నారంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. మండలంలోని డీర్ పార్క్ వద్ద ప్రధాన రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలేరో.. జన్నారం వైపు వస్తున్న బైక్‌ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మందపల్లి గ్రామానికి చెందిన దేవి సుదర్శన్ (45) రక్షిత్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 30, 2024

కాసిపేట: భారీ నగదు స్వాధీనం

image

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న వరంగల్‌కు చెందిన మహేష్ వద్ద రూ.1,20,700/-, జార్పుల అమృ వద్ద రూ.2,75,000/-, దండేపల్లికి చెందిన వెంకటేష్ వద్ద రూ.2,97500/- నగదును స్వాధీనం చేసుకొని SSTటీం ఇన్‌ఛార్జ్‌కి అప్పగించినట్లు ఎస్సై వివరించారు.

News March 30, 2024

సుగుణక్క గెలుపునకు పూర్తి సహకారం: రేఖా నాయక్

image

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపునకు పూర్తిగా సహకరిస్తానని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. శనివారం పట్టణంలో ఆమెను రేఖా నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా సుగుణక్కను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, తదితరులు ఉన్నారు.

News March 30, 2024

ఉద్యాన నర్సరీలోని పండ్ల తోటల వేలం: పీవో

image

ఉట్నూర్ ఉద్యాన నర్సరీ లోని పండ్ల తోటల ఫల సాయాన్ని వేలం వేయనున్నట్లు పీవో ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి మరియు జామ తోటల ఫల సాయాన్ని వేలం పాట ఉంటుందని తెలిపారు ఆసక్తి గల వ్యాపారస్తులు, సంస్థలు ఏప్రిల్ 6న మధ్యాహ్నం 3 గంటలకు ఉట్నూర్ ఐటీడీఏ నర్సరీలో జరిగే వేలంపాటలో పాల్గొనాలని కోరారు. ఇతర వివరాల కొరకు ఐటీడీఏ ఉద్యాన అధికారి శ్రీ సుధీర్ కుమార్ (9032313933) లను సంప్రదించాలని సూచించారు.