India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు మృతి చెందిన ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. ఆస్రా కాలనీకి చెందిన జుహార్ అలీ ఖాన్(74) ఆదివారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. తండ్రి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆవీద్ అలీఖాన్ (52) ఏడుస్తూ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులిద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మేనల్లుడని చేరదీస్తే తమను సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌కు చెందిన దేవన్న, దేవమ్మ దంపతులు వాపోయారు. తాను గతంలో మేస్త్రీ పని చేసే వాడినని, ఓ ప్రమాదంలో కాలుకోల్పోయి ఇంటికే పరిమితమయ్యానని దేవన్న పేర్కొన్నారు. దీంతో చేరదీసిన మేనల్లుడు తమను ఇంట్లోంచి వెల్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై RDOను కలిసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లగా ఆయన రాకపోవడంతో వెనుదిరిగామన్నారు.
ఆదిలాబాద్ ఆర్టీసీ కార్గో విభాగంలో విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ ఆన్సర్ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు. అదేవిధంగా ఉత్తమ డ్రైవర్‌గా అదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మహమ్మద్ ఎంపికయ్యారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీరికి ప్రగతి చక్రం పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు.
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోని గోండు గూడ బీట్ జువ్విగూడా ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. శుక్రవారం ఆ ప్రాంతంలో పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
కడెం ప్రాజెక్టును మెకానికల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యానంద్, డీఈ కరుణాకర్ శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు వరద గేట్ల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పలు గేట్లను ఎత్తి చూసి ప్రాజెక్ట్ అధికారులకు గేట్లు ఎత్తే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం మెకానికల్ విభాగంలో ఉన్న పలు పరికరాలను పరిశీలించారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మల్ నుంచి లోలంకి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంత్ (20), సంజయ్ (20), నితిన్ వెళ్తుండగా వారి బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రశాంత్, సంజయ్ అక్కడికక్కడే మృతి చెందారు. నితిన్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాత్రూంకు వెళ్లొచ్చేలోపే బైక్, ఫోన్ మాయమైన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. టూ టౌన్ ఎస్ఐ విష్ణు ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్వ రామ్ అనే వ్యక్తి శుక్రవారం బైక్ పై భీంసారి నుంచి గాంధీనగర్ వెళ్తుండగా మార్గ మధ్యలో బైకును పక్కన పెట్టి బాత్రూంకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ద్విచక్రవాహనం దొంగతనానికి గురైంది. వెంటనే బాధితుడు స్టేషన్ వెళ్లి వాహనంతో పాటు ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు.
MNCL: రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు చోటు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందులో ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం మంత్రి పదవి తమకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. కష్టపడి పని చేసే వారికి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ క్యాడర్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తుంది.
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 24న అండర్-19 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి బాబురావు తెలిపారు. జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పోటీలకు హాజరు కావాలని, 1-1-2006 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు.
నిర్మల్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వలస పోతుంటారు. అయితే నిరుద్యోగులుగా వెళ్తున్న కొందరు నిర్జీవంగా తిరిగివస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో సుమారుగా 40 వేల మంది ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు. కాగా ఈ ఏడాదిలోనే 20 మంది వివిధ కారణాలతో గల్ఫ్‌లో మరణించడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల భైంసా మండలానికి చెందిన ఇద్దరు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
Sorry, no posts matched your criteria.