Adilabad

News March 29, 2024

ADB: BRS నుంచి వలసలు.. ఎన్నికల్లో ప్రభావం పడేనా?

image

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి ఆదిలాబాద్‌లో డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి కాంగ్రెస్‌లోకి, జడ్పీ ఛైర్మన్ రాథోడ్‌ జనార్దన్‌ బీజేపీలోకి చేరిపోయారు. కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పై రెండు పార్టీల్లోకి జంప్‌ చేశారు. ముధోల్, సిర్పూర్ మాజీ MLAలు కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సిందే.

News March 29, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు ఠారేత్తిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలోనే నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది.

News March 29, 2024

ఆదిలాబాద్: అయిదేళ్లలో 68 మంది మృతి

image

ఉమ్మడి ADB జిల్లాలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, చిన్నారులు ఈతకొట్టేందుకు బావులు, చెరువులకు వెళ్తున్నారు. నీటిలోతు తెలియక మునిగి మృతి చెందుతున్నారు. గత అయిదేళ్లలో 68 మంది ఈత రాక నీటిలో మునిగి మృతి చెందారు. హోలీ రోజున ఈత రాక 5గురు మృతి చెందారు. కొత్తవారు తప్పనిసరిగా శిక్షకుల సమక్షంలో ఈత నేర్చుకోవాలని పూర్తిగా నేర్చుకున్న తర్వాతే ఒంటరిగా ఈత కొటేందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 29, 2024

నిర్మల్: స్నేహం, ప్రేమ.. సూసైడ్

image

నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్‌లో బుధవారం రైలు కింద పడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు ఇద్దరు నిజామాబాద్ నగరానికి చెందిన నందిని(20), శ్రీకాంత్ గా పోలీసులు గుర్తించారు. ఇరువురి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు తమ ప్రేమను కాదంటారని భావించి బాసరకు చేరుకున్నారు. రాత్రి 8.30లకు రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు.

News March 28, 2024

ADB: అనారోగ్యంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. ఎస్ఐ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడకి చెందిన శివయ్య(48) పాల వ్యాపారం చేస్తూ జీవించేవాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మనస్తాపం చెంది గురువారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News March 28, 2024

ADB: ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సివిల్ సర్వీస్ పరీక్ష కోసం 2024-25 విద్యా సంవత్సర మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ DMWO రాజలింగు ఓ ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33% సీట్లు, వికలాంగులకు 5 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్‌లో వచ్చేనెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 28, 2024

ADB: బీఎస్పీ నుంచి ఎంపీ బరిలో బన్సీలాల్‌ రాథోడ్..!

image

ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌ పార్లమెంట్‌ స్థానానికి బీఎస్పీ నుంచి ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బన్సీలాల్‌ రాథోడ్‌ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి గొడం నగేశ్, బీఆర్‌ఎస్‌ నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్‌ నుంచి ఆత్రం సుగుణ బరిలో ఉన్న విషయం తెలిసిందే.

News March 28, 2024

ADB: మీ ఇంటి నుంచే వాతావరణ సమాచారం తెలుసుకోండి!

image

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్‌’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

News March 28, 2024

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఉపాధ్యాయులే

image

అదిలాబాద్ ఎంపీకి జరుగుతున్న పోటీల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు గతంలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గతంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. BRS అభ్యర్థి ఆత్రం సక్కు సైతం గతంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఇటీవల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలిచారు.

News March 28, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్‌లో త్రిముఖ పోటీ

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలోనే తమ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించడంలో ఉత్కంఠ జరుగగా తాజాగా తమ అభ్యర్థి పేరు ప్రకటించేశారు. BJP నుండి గోడం నగేష్, CONG నుంచి సుగుణక్క, BRS నుండి ఆత్రం సక్కు ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఇక ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మూడు పార్టీల నుండి ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు.