Adilabad

News March 27, 2024

నిర్మల్: పాముకాటుతో యువరైతు మృతి

image

నాటువైద్యం వికటించి రైతు మృతి చెందిన ఘటన దస్తురాబాద్‌ మండలంలో జరిగింది. SI యాసిర్‌ ఆరాఫత్‌ వివరాలు.. గొడిసిర్యాల గొండుగూడకు చెందిన మెస్త్రం భుజంగరావ్‌(23)కు ఈనెల 18న పాముకాటు గురయ్యారు. ఓ నాటు వైద్యుడికి రూ.10వేలు ఇచ్చి వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 25న నిర్మల్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News March 27, 2024

ADB: 10వ తరగతి మూల్యాంకన డబ్బులు విడుదల

image

గత సంవత్సరం ఏప్రిల్, మే నెలలో నిర్వహించిన 10వ తరగతి మూల్యాంకన డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా ఉపాధ్యాయుల ఖాతాలో మంగళవారం జమ చేసినట్లు అధికారులు తెలియజేశారు. 10నెలల తర్వాత ఎట్టకేలకు బకాయిలు చెల్లించడంతో ఉపాధ్యాయులకు ఊరటనిచ్చింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల ఖాతాల్లో రూ.12.85 లక్షల నిధులు జమయ్యాయి.

News March 27, 2024

ADB: విచిత్రమైన ఆవు దూడ.. వీపుపైన కాళ్లు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆవుకు విచిత్రమైన లేగదూడ పుట్టింది. భీంపూర్‌ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన రైతు ప్రమోద్‌కు చెందిన ఆవు లేగదూడకు మంగళవారం జన్మనిచ్చింది. ఆ దూడ ముందు రెండు కాళ్లు సహజంగానే ఉన్నప్పటికీ.. వెనుక ఉండాల్సిన కాళ్లు మాత్రం వీపు పైన ఉన్నాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు తరలి వచ్చారు. అయితే జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జన్మిస్తాయని మండల పశువైద్యాధికారి సుభాష్‌ రాథోడ్‌ తెలిపారు.

News March 27, 2024

కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదే: అత్రం సక్కు

image

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే విజయం సాధిస్తామని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. ఘనపూర్, ఉట్నూర్ గ్రామంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా పని చేస్తే విజయం తథ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రా జైవంత్ రావు ఉన్నారు.

News March 26, 2024

MNCL: విద్యుత్ షాక్ తగిలి ఒకరి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు చూస్తే… మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన సిద్ధం పుల్లయ్య (82) అనే వృద్ధుడు తన ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ షాక్ తగిలి పుల్లయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు.

News March 26, 2024

రాష్ట్రంలో ఆదిలాబాద్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు ఠారెత్తిస్తున్నాడు.. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. తలమడుగు, సాత్నాలలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత మరింతే పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

News March 26, 2024

ఆదిలాబాద్: బస్సు- బైక్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. జైనథ్ మండలం బెల్లూరికి చెందిన అశోక్, బాపురావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జందాపూర్ ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అశోక్ తలకు తీవ్ర గాయాలు కాగా, బాపురావుకు గాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహన ఈఎంటీ కిషన్, పైలెట్ వసీంలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

News March 26, 2024

దస్తురాబాద్: పాము కాటుతో యువకుడు మృతి..!

image

పాము కాటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన దస్తురాబాద్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొడిసెర్యాల గోండుగూడెంకు చెందిన మెస్రం భుజంగరావు(26)కు ఈనెల 18న పాము కాటేసింది. అయితే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేకపోవడంతో ఆకొండపేట్‌లో నాటు వైద్యం తీసుకుంటున్నాడు. సోమవారం పరిస్థితి విషమించడంతో నిర్మల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News March 26, 2024

ఆదిలాబాద్‌లో పండుగ పూట 9 మంది మృతి

image

ఉమ్మడి ADB వ్యాప్తంగా హోలీ పండుగ రోజు 9మంది మృతి చెందారు. హోలీ ఆడి స్నానానికి వెళ్లిన నలుగురు వార్థా నదిలో మునిగి మృతి చెందారు. దండెపల్లిలోని గూడెం లిఫ్ట్ కాలువలో పడి కార్తీక్.. వాగులో పడి ADBకి చెందిన హర్షిత్, సారంగాపూర్‌కి చెందిన పెద్ద ఎర్రన్న మరణించారు. నిర్మల్‌కు చెందిన జాదవ్ గణేశ్ ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుతో చనిపోగా.. బెల్లంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు.

News March 25, 2024

పండగపూట తీవ్ర విషాదం.. వార్ధా నదిలో నలుగురు గల్లంతు

image

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధ నదిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు నదీమాబాదుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుల కోసం రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.