India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదర్శ్ దుర్గాదేవి మండలి వద్ద గురువారం రాత్రి దుర్గాదేవికి కాలనీవాసులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం పూజారి హారతి ఇవ్వగా దుర్గమ్మ రూపంలో కనిపించిందంటూ భక్తులు చర్చించుకున్నారు. అదే సమయంలో హారతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

2024- 25 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ-పాస్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు రెన్యూవల్, ఫ్రెష్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హుడైన విద్యార్థి పేరు SSC మెమోలో ఉన్న విధంగా ఆధార్ కార్డులో ఉండాలన్నారు. విద్యార్థుల ఆదాయపరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెంచామని చెప్పారు.

దమ్మ పరివర్తన దినోత్సవం నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో నాందేడ్- ఆమ్లా- నాందేడ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రత్యేక రైలు (నం.07025) నాందేడ్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరుతుందని, అదేవిధంగా శనివారం ప్రత్యేక రైలు (నం. 07026) ఆమ్లా నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైళ్లు ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో సైతం ఆగుతాయని తెలిపారు.

ఆర్టీసీ డ్రైవర్ అదృశ్యమైన ఘటన భైంసాలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎండీ.గౌస్ ఉద్దీన్ వివరాల ప్రకారం.. శివాజీనగర్‌కు చెందిన శామంతుల సుదర్శన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదాయానికి మించి అప్పులు కావడంతో కనిపించకుండా పోయాడు. కాగా ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్న నా మరణానికి ఎవరూ కారణం కారు’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టి వెళ్లి పోయాడు. భార్య అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

దసరా పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 2 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ రజాక్ అలీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్లో ఈనెల 12న దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా శుక్రవారం ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు, ముధోల్, భైంసాలో 13న దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా శనివారం ఉదయం 10 నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1295 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించగా.. తాజాగా 1164 పోస్టులు మాత్రమే భర్తీకి నోచుకున్నాయి. మరో 131 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 324 పోస్టులకు 296 పోస్టులు భర్తీ అయ్యాయి. మరో 28 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 27, మంచిర్యాల జిల్లాలో 33 పోస్టులు, నిర్మల్ జిల్లాలో 43 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.

ఈ నెల 17న కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించే గిరిజన పోరాట వీరుడు కొమురం భీం 84వ వర్ధంతికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు కొమురం భీం మనుమడు కొమురం సోనేరావు, వర్ధంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ పెందోర్ రాజేశ్వర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌తో కలిసి ఆహ్వాన పత్రికను అందించినట్లు పేర్కొన్నారు.

★ లోకేశ్వరం: మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య
★ ఆదిలాబాద్: రైలు కింద పడ్డ వ్యక్తి మృతి
★ ఆసిఫాబాద్: పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు
★ ఆదిలాబాద్: పట్టగొలుసు మింగిన 7 నెలల పాపా
★ నర్సాపూర్: రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
★ మంచిర్యాల: వ్యక్తి ఆత్మహత్య
★ చెన్నూర్: చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్
★ ఇచ్చోడ: రోడ్డుప్రమాదంలో ఒకరికి గాయాలు
★ లోకేశ్వరం: అనారోగ్యంతో ఒకరు మృతి

రెబ్బెనకు చెందిన ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెలు డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ కొలువులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అక్క ప్రవళిక స్కూల్ అసిస్టెంట్‌గా, చెల్లెలు రష్మిక SGTకి ఎంపికయ్యారు. వీరి తండ్రి మల్లేష్ బార్బర్‌గా, తల్లి పద్మ కేజీబీవీలో సీఆర్టీగా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు ఆడపిల్లలను ప్రయోజకులను చేయాలని కోరికతో కష్టపడి చదివించామని, వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఫేక్ మేసేజ్‌లు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు తీసి గ్రూపుల్లో పోస్టు చేసిన, ఫార్వర్డ్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకొని, ఒకటికి రెండుసార్లు వార్త సరైనదా, కాదా పరిశీలించుకుని ప్రచురించాలన్నారు.
Sorry, no posts matched your criteria.