India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MNCL జిల్లా కాసిపేటలో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు యత్నించింది. కాసిపేటకి చెందిన యువతి ASF జిల్లాలోని ఓ మండలంలో వైద్యురాలిగా పనిచేసేది. అదే మండలంలో విధులు నిర్వర్తించే ఓ వైద్యాధికారితో ఆమెకు పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారింది. ఈక్రమంలో అతను మరోకరితో ప్రేమాయణం నడిపారు. విషయం ఆమెకు తెలియడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. మానసిక వేదనకు గురైన వైద్యురాలు విషం తాగగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
పంట దిగుబడులు రాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహాత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మన్నూరు గ్రామానికి చెందిన రైతు జాదవ్ రాజారాం (56) 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. రబీలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల దిగుబడి రాక మనస్తాపానికి గురైన రాజారాం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కడెం మండలం పెద్దూర్ గ్రామ సమీపంలోని గిరిజన వసతిగృహం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దూరుకు చెందిన కత్తె రాపాక గంగన్న(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఖానాపూర్ ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మరణించినట్లు బంధువుల తెలిపారు. సైకిల్ పై కడెం నుంచి పెద్దూరుకు వెళ్తున్న గంగన్నను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహన చోదకుడికి గాయాలైనట్లు సమాచారం.
కాలినడకన వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్ళిన సంఘటన శనివారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ స్ధానిక పంజాబ్ చౌక్ వద్ద బస్సు దిగి భూక్తాపూర్‌లోని బంధువుల ఇంటికి కాలినడకన వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అగంతకుడు అకస్మాత్తుగా రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పట్టణంలో కాంగ్రెస్ నేత అర్జుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో జరిగింది. పట్టణంలోని బృందావన కాలనీకి చెందిన మాటేటి రాజయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ కొరకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా గురుకుల విద్యాలయాల సెక్రటరీ సీతాలక్ష్మీ వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆసిఫాబాద్‌లోని అడా ప్రాజెక్టులో ఈరోజు ఓ వ్యక్తి మృతదేహాం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తెల్లారం కంచరగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్(28) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 19న ఆటోలో బయటికి వెళ్లిన అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా ఈరోజు అడా ప్రాజెక్టులలో మృతదేహాం లభ్యమైనట్లు వెల్లడించారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్-జనవరి నెలలో రాసిన 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇప్పటివరకు వెలువడలేదు. ఫలితాలు రాకముందే మరో పరీక్షల షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారంటూ డిగ్రీ విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. వెంటనే 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రత్యేక ఓటరు సవరణ తుది జాబితా ప్రకారం ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 16,43,604 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,02,267 మంది పురుషులు, 8,41,250 మంది మహిళలు, 87 మంది ఇతరులు ఉన్నారు. ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం సిర్పూర్ మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లోనూ అభ్యర్థుల జయాపజయాల్లో మహిళా ఓటర్లే కీలకం.
Sorry, no posts matched your criteria.