Adilabad

News March 22, 2024

పెద్దపల్లి: కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి గడ్డం వంశీ నేపథ్యం ఇదీ!

image

పెద్దపల్లి MP అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ పేరును ఖరారు చేసింది. 2010లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మేనేజ్‌మెంట్ డిగ్రీ USAలో పూర్తి చేశాడు. 2011లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో శిక్షణ తీసుకుని, 2012లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. వీ6 ఛానల్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు.

News March 21, 2024

ASF: నకిలీ PG సర్టిఫికెట్.. లెక్చరర్ డిస్మిస్

image

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న నాగరాజును సర్వీసు నుంచి తొలగించినట్లు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్‌గా విధుల్లో చేరిన నాగరాజు నకిలీ పీజీ సర్టిఫికెట్ సమర్పించినట్లుగా నిర్ధారించి విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 21, 2024

ADB: 40 ఏళ్ల నుంచి ఆ ఊరిలో నీరు ఇంకలేదు..!

image

ఆదిలాబాద్ ‌లోని తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్ గూడకు గ్రామ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి చేతి పంపు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోరు వేసినప్పటి నుంచి అక్కడ నీరు ఉబికి వస్తోంది. అన్ని కాలాల్లో 24 గంటలు నీరు ఉంటుందని, భూమిలో నీటి ఊట ఎక్కువగా ఉన్నచోట ఇలా జరుగుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ బోరింగ్ వల్లనే ఆ ఊరికి బోరింగ్ గూడ అని పేరు వచ్చిందన్నారు.

News March 21, 2024

ADB: కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి ఆత్రం సుగుణ నేపథ్యం ఇది..!

image

కాంగ్రెస్ పార్టీ తరఫున ADB MP స్థానం ఆత్రం సుగుణకు కేటాయించే అవకాశాలున్నాయి. ఆమె అభ్యుదయ భావాలతో పలు ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ ఆత్రం సుగుణ కీలక పాత్ర పోషించారు. 1995లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జన్నారం మండలం మురిమడుగు నుంచి గెలిచారు. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ.. ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

News March 21, 2024

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆత్రం సుగుణ

image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆత్రం సుగుణ సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జ్ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆమె బరిలో ఉన్నారు.

News March 21, 2024

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత

image

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత, కడెం మండలానికి చెందిన సిద్ధార్థ నాయక్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం కడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉందని వాపోయారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆయన తెలిపారు. ఓయూ జేఏసీ తరఫున పోటీ చేయనున్నానని ఆయన వెల్లడించారు.

News March 21, 2024

ఆదిలాబాద్-మహారాష్ట్ర బార్డర్‌లో హై అలర్ట్ 

image

మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్ కౌంటర్‎తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. గడ్చిరోలి ఎన్ కౌంటర్‎తో మావోలు ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రాణహిత తీరం వెంట హై అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు హతమవ్వగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచారు.

News March 21, 2024

నేడు ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

ఆదిలాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోడం నగేశ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.

News March 21, 2024

మంచిర్యాల: BRSకు మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాక్

image

మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బాల్కసుమన్‌తో విభేదాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి BRS టికెట్టు రాకపోవటంతో ఆయన BRS కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు రాలేదని పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడటం చెన్నూర్‌కి తీరని లోటని స్థానికులు భావిస్తున్నారు.

News March 21, 2024

నిర్మల్: కారు దిగేందుకు సిద్ధం!

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ..BRS నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండటంతో ఆ ప్రభావం నిర్మల్ జిల్లాలో కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విఠల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో కాంగ్రెస్, BJP బలంగా ఉండటంతో ఈ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తి, BRS కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు BRSను వీడనున్నారు.