Adilabad

News October 3, 2024

ADB:డిజిటల్ కార్డుల సర్వేను సమర్ధవంతంగా చేపట్టాలి: కలెక్టర్

image

ఈ నెల 3వ నుంచి డిజిటల్ కార్డుల సర్వేను సమర్ధవంతంగా చేపట్టాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ వార్డు, గ్రామ పంచాయతీని ఫైలెట్ ప్రాజెక్ట్ గా సర్వే బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈనెల 8 తేదీ వరకు సర్వే పూర్తిచేయాలన్నారు.

News October 2, 2024

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా ఇలంబరితి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్, మంచిర్యాల జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్‌గా ఆయన్ను నియమించారు. జిల్లాల్లో పర్యటించడంతో పాటు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.

News October 2, 2024

రంజీకి ఎంపికైన ఆదిలాబాద్ క్రీడాకారుడు

image

హైదరాబాద్ రంజీ జట్టుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంపికైన తొలి క్రీడాకారుడిగా హిమ తేజ చరిత్ర సృష్టించాడు. ఆదిలాబాద్‌కు చెందిన హిమ తేజ జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 11, 14 తేదీల్లో డెహ్రాడూన్‌లో జరిగే రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినధ్యం వహించనున్నాడు.

News October 2, 2024

ADB: నేటి నుంచి పాఠశాలలకు 13 రోజులు సెలవులు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. ఈ సెలవులు అక్టోబర్ 14 వరకు వుంటాయని, తిరిగి పాఠశాలలు ఈ నెల 15న తిరిగి ప్రారంభమవుతాయన్నారు. ఈ సెలవు రోజుల్లో ఎవరైనా ప్రైవేట్ క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చురించారు.

News October 1, 2024

ADB: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

నిర్మల్: సడలని సంకల్పం.. అప్పుడు సర్పంచ్ ఇప్పుడు టీచర్..!

image

చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు. రాజకీయంలో జిల్లాస్థాయిలో తనదైన ముద్ర వేసుకొని ఇప్పుడు డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి మన్ననలు పొందుతున్నాడు. TUలో బీఈడీ పూర్తిచేసిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మాజీ సర్పంచ్(2013)నంద అనిల్ నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు సాధించి, సాంఘిక శాస్త్రం విభాగంలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆయనను పలువురు అభినందించారు.

News October 1, 2024

ఆదిలాబాద్: DSCతో భర్తీ కానున్న పోస్టులు

image

ఆదిలాబాద్ జిల్లాలో DSCతో పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తం 324 పోస్టుల్లో 74 స్కూల్ అసిస్టెంటు, 14 లాంగ్వేజ్ పండితులు, రెండు పీఈటీలు భర్తీ కానుండగా అత్యధికంగా 209 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ సారి కొత్తగా ప్రత్యేకావసర పిల్లల బోధనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను నోటిఫై చేశారు. ఇందులో ఆరు స్కూల్అసిస్టెంటు, 19 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.

News October 1, 2024

ఆదిలాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

ఆదిలాబాద్ రాంనగర్‌లో దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు ఎస్ఐ విష్ణు తెలిపారు. మరో మహిళ ఆ గృహానికి అమ్మాయిలను మభ్యపెట్టి తీసుకెళ్లి వేశ్య వృత్తిలోకి దింపుతోందన్నారు. సోమవారం ఇంట్లో దాడి చేయగా వ్యభిచార గృహం నిర్వాహకులు, అమ్మాయిలను సరఫరా చేసే మహిళ, ముగ్గురు విటులు, బాధితులను గుర్తించి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

News October 1, 2024

ADB: డీఎస్సీ ఫలితాల్లో 1వ ర్యాంకు సాధించిన పూర్ణచందర్ రెడ్డి

image

తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల గ్రామానికి చెందిన నీగ పూర్ణ చందర్ రెడ్డి జిల్లాలోనే మెుదటి ర్యాంకు సాధించాడు. దీంతో ఆయన తల్లిదండ్రులతో పాటు ప్రోత్సహించి గ్రామస్థులు అభినందించారు. మండలానికి చెంది ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు.

News October 1, 2024

రైతుల రుణాలను మాఫీ చేయాలి: ఎంపీ నగేశ్

image

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేస్తామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చి రైతులకు న్యాయం చేయలేదని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రుణమాఫీ కాని రైతుల రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.