India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ, తెలంగాణ వయోవృద్ధుల సమాఖ్య, ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత పేర్కొన్నారు. వయోవృద్ధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పేర్కొన్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించుచున్నట్లు తెలిపారు.

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో STG పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ADBలో 148 పోస్టులకు 4514 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:30గా ఉంది. ASFలో 190 పోస్టులకు 2710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:14గా ఉంది. MNCLలో 165 పోస్టులకు 2527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:15గా ఉంది. NRMLలో 175 పోస్టులకు 2372 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:13గా ఉంది.

జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులకు పట్టు పరిశ్రమ/పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు. సోమవారం ఉ.10 గంటలకు జన్నారం పట్టణంలోని పొన్కల్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు వస్తున్నారని వారు వెల్లడించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు కూడా సకాలంలో రావాలని వారు సూచించారు.

ఎగువ నుంచి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కుడి, ఎడమ కాల్వలకు 806, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 902 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.

హైదరాబాద్‌లోని కొమరం భీం స్టడీ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, డా.సిడాం మధుకర్, మేస్రం నాగోరావు, తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో TG DEECET-2024లో ర్యాంక్ సాధించి ఆగస్టు నెలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులకు మరొకసారి అవకాశం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో అక్టోబర్ 1న ఉ.10 నుంచి సా.5 గంటల వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో సోమవారం SGFజోనల్ స్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు DEOయాదయ్య, SGF జిల్లా సెక్రటరీ సాంబశివరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంట్రీ ఫామ్‌లతో ఉదయం 9గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు TW క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్ అరవింద్‌ను సంప్రదించాలని సూచించారు.

బాసర అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాల్లో పలు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 11వరకు అభిషేకాలు, 9న అక్షరాభ్యాసం తప్ప మిగతా ఆర్జిత సేవలు రద్దు, 11 నుంచి 13 చండీహోమం, 12న ఉదయం 10 గం.ల వరకు అక్షరాభ్యాసములు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

దసరా సెలవుల నేపథ్యంలో ఆదిలాబాద్ రిజియన్‌లోని వివిధ డిపోల నుంచి 412 ప్రత్యేక బస్సులను JBS నుంచి ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆదిలాబాద్ RTC RM సొలొమాన్ పేర్కొన్నారు. Oct 1 నుంచి 11 వరకు ఆదిలాబాద్ డిపో-78, అసిఫాబాద్-73, బైంసా-11, మంచిర్యాల-125, నిర్మల్-120, ఉట్నూర్-5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు OCT 1 నుంచి OCT 11 వరకు నడుస్తాయని పేర్కొన్నారు.

ముధోల్ మండల కేంద్రానికి చెందిన గడపాలె అంజలి ప్రముఖ మరాఠీ ఛానల్లో నిర్వహిస్తున్న “మీ హోణార్ సూపర్ స్టార్ చోటే ఉస్తాద్ సీజన్-3” సింగింగ్ షోలో అద్భుతంగా పాటలు పాడుతూ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా చిన్నారి చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి పాటల్లో రాణిస్తూ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.