India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం కన్నెపల్లి యూపీఎస్ పాఠశాల తరగతి గదిలో శనివారం పాము రావడంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. ఇలా గదులలోకి పాములు, తేళ్లు, క్రిమి కీటకాలు రావడంతో విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.

బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అలంకరిస్తామన్నారు. మొదటిరోజు శేలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడవరోజు చంద్రఘటా, నాలుగోరోజు కూష్మాండ అలంకరణ, ఐదోరోజు స్కదమాతగా, ఆరోరోజు కాత్యాయగాని, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజు మహాగౌరీగా, తొమ్మిదోజు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తారని తెలిపారు.

గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల లెక్క తేలింది. సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీల్లో వార్డుల వారీగా సిద్దం చేసిన ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను పంచాయతీ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలోని 17 మండలాల్లో గల 473 గ్రామ పంచాయతీల పరిధిలో 4,41,795 మంది ఓటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. ఇందులో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఒక కాలనీలో 3 సంవత్సరాల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

రాజీ మార్గమే రాజా మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి.రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కేసులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.

జాతీయ లోక్ అదాలత్ కు భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. అదిలాబాద్, ఉట్నూర్, బోథ్ అదిలాబాద్ న్యాయస్థానాల్లో వివిధ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న 954 పోలీస్ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. రూ.12 లక్షల పైచిలుకు జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 287 ఎఫ్ఐఆర్, 665 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారం అయిందన్నారు. 18 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ.3,71,175/- తిరిగి అందించామన్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట సంతోష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారంతో వ్యభిచారం నిర్వహిస్తున్న తోట మహేందర్, ఓ మహిళ, విటుడు బోలెం శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆదిలాబాద్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం పేర్కొన్నారు. అక్టోబర్ 5 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు అవకాశం ఇచ్చారని తెలిపారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి.. ఫీజు చెల్లించండి.
>>SHARE IT

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించినట్లు రాష్ట్ర బాల్ బ్యాట్మెంటన్ జాయింట్ సెక్రటరీ తిరుపతి తెలిపారు. పోటీలలో సింగరేణి ఎస్ఓ టు జీఎం కె.రాజమల్లు పాల్గొని మాట్లాడుతూ..రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తే సింగరేణి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఆటలలో గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.