Adilabad

News September 25, 2024

ADB: విషాదం.. పురుగు మందు తాగిన ప్రేమికులు

image

ఉట్నూరు మండలం రాంజీగూడకు చెందిన ఆత్రం హనుమంత్, నార్నూర్ మండలానికి చెందిన ఓ యువతీ ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందారు. సోమవారం పురుగు మందు తాగేశారు. హనుమంత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. హనుమంత్ మృతి చెందగా, యువతిని మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 25, 2024

ADB: పోలీసుల విధులకు ఆటంకం.. 13మందికి పైగా కేసులు

image

పోలీసుల విధులకు అడ్డుపడి, పోలీస్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రోడ్డు పై వచ్చి పోయే వారికి ఇబ్బంది పెట్టిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ సీఐ కరుణాకర్ రావ్ తెలిపారు. ఇటీవల ఓ విద్యార్థి చనిపోగా కారకులపై చర్యలు తీసుకోవాలని బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉన్నా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో 13 మందితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

News September 25, 2024

వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశం

image

గ్రామ పంచాయితీ ఎన్నికలు, నర్సరీ ప్లాంటేషన్, హరితనిది, హార్టికల్చర్ ప్లాంటేషన్, వైద్యం, స్వచ్ఛదనం పచ్చదనం, పీసా యాక్ట్ తదితర అంశాలపై మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. సీజినల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందేలా చూడాలన్నారు.

News September 24, 2024

వాంకిడి: ఎడ్లబండి పై వాగు దాటిన ITDA PO

image

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ITDA PO ఖుష్బూ గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం వెల్గి ఆశ్రమ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎడ్లబండి పై వాగు దాడి వెళ్లారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల అటెండెన్స్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.

News September 24, 2024

ఆదిలాబాద్: వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు

image

మావల పోలీసుస్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో వ్యభిచారం గృహంపై సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆ కాలనీలో గల ఓ ఇంట్లో మహిళ వ్యభిచారం నడిపిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. మహిళతో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారివద్ద నుంచి రూ.3200 నగదు, రెండు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

News September 24, 2024

ఆసిఫాబాద్‌లో సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ పురుషులు, మహిళల హ్యాండ్ బాల్ పోటీలను ఈ నెల25న ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9గంటలకు హ్యాండ్ బాల్ కోచ్ అరవింద్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.

News September 23, 2024

ADB: సీఎంకు వివరాలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యే

image

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జైనూర్ ఘటనపై పూర్తి వివరాలను తెలియజేశారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని వారు కలిశారు. ఉట్నూర్ కొమురం భీం కాంప్లెక్స్‌లో రాయిసెంటర్ సార్మేడీలు, రాజ్ గోండు సేవా సమితి సభ్యులు, అన్ని ఆదివాసీ, కుల సంఘాల నాయకులతో సుధీర్ఘంగా చర్చించిన అంశాలపే సీఎంకు వివరించారు.

News September 23, 2024

తాంసీలో క్షుద్రపూజల కలకలం..!

image

తాంసి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల ఎదుట క్షుద్రపూజల ఆనవాలు కలకలం రేపుతున్నాయి. రహదారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కుంకుమ, ఇస్తారాకు, ఎర్రని, నల్లని దారాలు, గుడ్డును ఉంచారు. వాటిని చూసిన గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు.

News September 23, 2024

MNCL: అత్తను హత్య చేసిన అల్లుడు ఆత్మహత్య..?

image

గోదావరిఖని శివారులోని గోదావరి నదిలో ఆదివారం గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని చున్నంబట్టికి చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. కాగా, జులైలో ఈతను అత్తను హత్య చేసి ఇటీవల జైలుకి వెళ్లాడు. బెయిల్​‌‌పై విడుదలైన వెంకటేశ్ గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో శమమై కనిపించాడు. వెంకటేశ్ ది ఆత్మహత్య? హత్య అనేది తేలాల్సి ఉంది.

News September 23, 2024

మంచిర్యాల: నేటి నుంచి పలు రైళ్ల రద్దు

image

కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీపై ఆధారపడాల్సి ఉంటుంది.