India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామానికి చెందిన అమెడా గజ్జన్న(50)బాల్కానీపై నుంచి పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గజ్జన్న ఇంటి పక్కన శుభకార్యంలో భోజనానికి వెళ్లాడు. అక్కడ బాల్కనీ నుంచి కిందికి చూస్తూ కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రుక్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆనందంగా భర్త, పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది. ఎల్మా రాకేశ్ రెడ్డి తన భార్య రుతుజరెడ్డి (30), కూతుళ్లు వరణ్య (5), కియారా (2)తో కలిసి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గణేశ్ మందిరం వద్ద మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రుతుజ తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.

ఈనెల 21న శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి సీతక్క రానున్నట్లు ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్ తెలిపారు. మంత్రితో పాటు ఆత్రం సుగుణక్క, బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గజేందర్, అదిలాబాద్ శ్రీనివాస్ రెడ్డి, సత్తు మల్లేశ్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

ఆదిలాబాద్‌లోని గాంధీనగర్‌లో కుక్కల బెడద ఎక్కువైపోయింది. కాలనీలో శుక్రవారం ఆరుగురిపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసు సిబ్బంది సమిష్టి కృషితోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెలరోజుల ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకునేందుకు చర్యలు చేపట్టామని ఇందులో భాగంగానే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు.

పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి రమేష్(36) ఆత్మహత్య పాల్పడిన ఘటన హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమేశ్ మంచిర్యాలలో నివాసం అంటూ మెప్మాలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

బోథ్ మండల కేంద్రంలోని చైతన్య యూత్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో గణేశ్‌ను ఏర్పాటు చేశారు. నిత్యం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలిచారు. కాగా గురువారం రాత్రి లడ్డూ వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో చివరగా రూ.81 వేలకు మండల కేంద్రానికి చెందిన ఇట్టెడి చిన్నారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండలి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్, మహేందర్ ఉన్నారు.

నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిష్టర్, రికార్డులను పరిశీలించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ 11 రోజుల పాటు నిద్రాహారాలు మాని విధులను నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే గణపతి మండపాల నిర్వాహకులకు, హిందూ సంఘాలకు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో PG మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్‌లు యూనివర్సిటీ వెబ్సైట్ www braou.online.inలో అందుబాటులో ఉన్నాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.