India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో NCC సీఏటీసీ-7 శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన 600 మంది కెడెట్లు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా NCC కమాండింగ్ అధికారి కల్నల్ వికాస్ శర్మ మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సైనికులకు ఇచ్చే తరహాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

హనుమకొండ పట్టణంలోని JNSస్టేడియంలో 2రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు గోల్డ్ మెడల్ సాదించినట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేశ్ తెలిపారు. ఆదివారం ఫైనల్స్‌లో మహబూబ్ నగర్ జట్టుతో తలపడి గెలుపొందినట్లు తెలిపారు. క్రీడాకారులు, కోచ్ సునార్కర్ అరవింద్‌ను పలువురు అభినందించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పొచ్చన-రూప దంపతుల కుమారుడు సాయికృష్ణ పట్టుదలతో చదివి మూడు ప్రభుత్వ కొలువులు సాధించాడు. 2018లో గ్రూప్-4 పరీక్షలో సత్తాచాటి, ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2022లో మళ్లీ గ్రూప్-4 పరీక్ష రాసి ర్యాంకు సాధించాడు. తాజాగా విడుదలైన ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం నిర్వహించిన పరీక్ష ఫలితాలలో అసిస్టెంట్ ఎనలైటిక్ ఆఫీసర్‌గా ఎంపిక అయ్యాడు.

మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కాసిపేట మండలం మలకపల్లిలోని ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిసరాలు, విద్యార్థులు నిద్రించే గదులు, వంటశాల, రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసిన అనంతరం అక్కడే నిద్రించారు.

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 700.125 అడగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 2,111 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు.

బస్సులో పోగొట్టుకున్న బంగారు నగలతో కూడిన బ్యాగును కనుక్కొని బాధితురాలికి మంచిర్యాల పోలీసులు అందజేశారు. సీఐ బన్సీలాల్ వివరాలు.. జగిత్యాల నుంచి ఇందారంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి మంచిర్యాలకు వచ్చిన సానియా అనే మహిళ బస్సు దిగే సమయంలో బ్యాగ్ మర్చిపోయింది. దీంతో పోలీసులను సంప్రదించగా వెంటనే బ్లూ కోల్డ్ సిబ్బంది సీసీ కెమెరాలను పరీక్షించి రైల్వే స్టేషన్‌లో బ్యాగును గుర్తించి బాధితురాలికి అందజేశారు.

మంచిర్యాల జిల్లాలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాసిపేట మండలం దేవాపూర్‌లో ఇద్దరు యువకులను ఓ పాము కాటేసింది. గ్రామస్థులు గమనించగా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే యువకుడు నవీన్ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.950 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 966 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్, రైటు కెనాల్‌ల ద్వారా 870, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమంలో భాగంగా రూ.500లకు LPG సిలిండర్‌ను అందజేస్తుందని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపికై సిలిండర్ పొందిన వారికి ఆధారిత ఆన్‌లైన్ బదిలీ (డీబీటీ) ద్వారా బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ చేస్తున్నట్లు తెలిపారు. ఖాతాలో డబ్బులు నాలుగు రోజుల్లో జమ కానట్లయితే 1967 లేదా 180042500333 నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు.

నిర్మల్ జిల్లా కుభీర్ (M) అంతర్నిలో కనిపించకుండా పోయిన చిన్నారి వర్ష(7) అనుమానాస్పదంగా మృతిచెందింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఈనెల 9న బాలిక కనిపించకుండా పోవడంతో కుభీర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, నిన్న వర్ష ఇంటికి కూత వేటు దూరంలో చెత్తకుప్పలో చిన్నారి శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వర్షగా గుర్తించారు.
Sorry, no posts matched your criteria.