India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక రిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతాయన్నారు. ఉచిత కౌన్సెలింగ్ కొరకు 14416 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

విద్యార్థిని పాము కాటేయడంతో వెంటనే ఓ ఉపాధ్యాయుడు నోటితో విషం తొలగించి విద్యార్థి ప్రాణాన్ని కాపాడాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 1వ తరగతి విద్యార్థి యశ్వంత్‌ని పాము కాటేసింది. వెంటనే ఉపాధ్యాయుడు సురేశ్ నోటితో విషం తీసేసి విద్యార్థి ప్రాణం కాపాడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జిల్లాకు చెందిన క్రికెటర్ మృతిచెందాడు. శాంతినగర్‌కు చెందిన శ్రీహరి తన కుమారుడి బ్లడ్ రిపోర్ట్స్ కోసం సోమవారం రిమ్స్‌కి వెళ్లాడు. ఆసుపత్రిలో బాత్‌రూమ్‌కి వెళ్లిన శ్రీహరి తిరిగి రాలేదు. కాగా టాయిలేట్ నుంచి ఫోన్ రింగ్ అవడం గమనించిన సిబ్బంది తలుపు తెరిచి చూడగా అతడు కిందపడి ఉన్నాడు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

బాసర అర్జీయూకేటి వీసీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసోసియేట్ డీన్లు సోమవారం విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించి, ప్రభుత్వంలోని అవసరమైన ఏజెన్సీలతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని, ముంపు బాధిత రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన అదిలాబాద్ జిల్లా రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెన్ గంగ నది పరివాహక ప్రాంతంలో వరదలు పోటెత్తి పత్తి, సోయాబీన్, కంది పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.

నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు వేదన అనుభవిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి గదులు లేవు. మెట్ల మార్గంలో కనీసం సేద తీరే పరిస్థితి లేదు. మార్గమధ్యలో వర్షం కురిస్తే పూర్తిగా తడిసి పోవాల్సిందే. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జలపాతం వద్ద మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

DOST ద్వారా DEGREE కళాశాలలో స్పెషల్ ఫెజ్ ద్వార ప్రవేశాలు పొందేందుకు నేడు చివరి తేదీ అని ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత పేర్కొన్నారు. SEP 9 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని SEP 4 నుంచి 9 వరకు వెబ్ అప్షన్ పెట్టుకోవాలన్నారు. SEP 11న సీట్ల కేటాయింపు ఉంటుందని SEP 11 నుంచి 13 వరకు ఆన్ లైన్ పేమెంట్ పూర్తి చేయాలని, SEP 12 నుంచి 13లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.

కోర్టులో తన తండ్రికి శిక్ష పడుతుందేమో అన్న భయంతో కొడుకు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జైనథ్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గూడ రాంపూర్‌కు చెందిన దేవన్నపై జైనథ్ PSలో గతంలో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నేటి నుంచి వాదనలు ప్రారంభంకానున్నాయి. తండ్రికి శిక్ష పడుతుందేమోనని కొన్ని రోజులుగా కుంగిపోతున్న కొడుకు బండారి సంతోశ్(15)ఈ నెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదిలాబాద్ 2- పట్టణ పోలీసులు పేకట స్థావరలపై దాడుల చేసినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఓ మద్యం షాప్ యజమాని ఇంట్లో తనిఖీలు చేయగా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.2.28 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశామన్నారు. అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. మరో చోట దాడులు చేయగా ఐదురిని అరెస్ట్ చేసి, రూ.5.090 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈనెల 29న స్పోర్ట్స్ అండ్ కరాటే అసోసియేషన్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్-2024 పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడు జితేందర్ సింగ్ భాటియా తెలిపారు. పోటీల్లో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు సుమన్, టీపీసీసీ అధ్యక్షుడు మహశ్: కుమార్ గౌడ్ హాజరవుతారన్నారు.
Sorry, no posts matched your criteria.