India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మహరాష్ట్రలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పిప్పలకోటికి చెందిన జానకొండ నారాయణ(38) గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కాగా ఇవాళ మహరాష్ట్రలోని అంబాడీ అడవుల్లో అతను కాలిబూడిదై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా హత్యా చేశారా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో మున్నూరు కాపు సంఘం యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడు చూపరులను ఆకట్టుకుంటోంది. ఎలుకలు లంబోదరుడిని ఎగరేసి పట్టుకున్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని గ్రామ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 11 రోజులు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేస్తామని యూత్ సభ్యులు తెలిపారు.

వినాయక చవితికి మహారాష్ట్ర ప్రాంతంలోని పాలజ్ కర్ర గణపతికి ఓ ప్రత్యేకత ఉంది. కుబీర్ సమీపంలో ఉంటే ఈ గణపతిని 1948లో ప్రతిష్ఠించారు. 1948లో పాలజ్‌లో అంటువ్యాధులు ప్రబలి 30మందికి పైగా మరణించారు. ఆ సంవత్సరం వచ్చిన వినాయకచవితికి అక్కడి ప్రజలు నిర్మల్‌లో కొయ్య గణపతిని చేయించి వారి గ్రామంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతిసంవత్సరం నిమజ్జనం చేయకుండా గణపతికి పూజలు చేస్తున్నారు.

ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై మండల తాహశీల్దార్‌లతో ఆమె సమీక్షించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.

వినాయక చవితి పండుగ ను శాంతియుత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ కే. సంపత్ వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని సున్నంబట్టి వాడకు చెందిన రాజమల్లు (37) ఇంటీరియర్ వర్క్ చేస్తుంటాడు. ఇవాళ అతను రైలు పట్టాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొట్టింది. అతనికి తీవ్రగాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సంపత్ తెలిపారు.

రానున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 28న ఓటర్ తుది జాబితాను విడుదల చేయనున్నట్లు డీపీఓ శ్రీలత తెలిపారు. ఈ నెల 13న వార్డుల వారీగా ఓటర్ జాబితా ముసాయిదా ప్రదర్శన, 14 నుంచి 21 వరకూ అభ్యంతరాల స్వీకరణ, 18, 19 తేదీల్లో రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 26న ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలు స్వీకరించి 28న తుది జాబిత విడుదల చేస్తామని వెల్లడించారు.

జైనూర్‌లో జరిగిన ఘర్షణతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైనూర్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకొని కొత్తవారిని రానివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మీదుగా వెళ్లే బస్సులను రద్దు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అడిషనల్ DG మహేశ్ భగవత్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, SP గౌష్ ఆలం, SP శ్రీనివాసరావు, ఇతర అధికారులతో చర్చలు జరిపారు.

మందమర్రి పట్టణంలోని ఇందూ గార్డెన్స్‌లో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు.

2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఎంపిక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 16 లోపు www.navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 2025 జనవరి 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కావున జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.