Adilabad

News September 5, 2024

ADB: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT

News September 4, 2024

జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు: ఎస్పీ

image

జైనూర్‌లో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. జైనూరు ఘటనలో పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. వదంతులను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News September 4, 2024

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను అభినందించిన కేటీఆర్

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన రక్షిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను అభినందించారు.

News September 4, 2024

ఖానాపూర్: పేపర్ బాయ్ టు MLA

image

పేపర్ బాయ్ టు MLA వరకు ఎదిగిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. నేడు పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయన చిన్నతనంలో చదువుతోపాటు పేపర్ బాయ్‌గా, కాలేజీ రోజుల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరోవైపు విలేకరిగా పనిచేశారు. అనంతరం ITDA పైసా చట్టం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలుపొందారు.

News September 4, 2024

మంచిర్యాల: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

image

కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. SI సురేశ్ వివరాలు.. పాల్వంచకు చెందిన రాధ(28), చెన్నూర్‌కి చెందిన రాముతో 9ఏళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజుల నుంచే భార్యను రాము వేధించడంతో తమ్ముడు ప్రసాద్ ఇంటికి వెళ్లింది. ఈ నెల 1న ఆమెను తీసుకెళ్లడానికి వచ్చిన రాము ఆమెతో గొడవపడి ముఖంపై దిండుతో అదిమి చంపేశాడు. ‘మీ అక్కకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది. అందుకే చంపేశా’ అని రాము ఆమె తమ్ముడికి చెప్పి పారిపోయాడు.

News September 3, 2024

ఆదిలాబాద్: DEGREEలో చేరేందుకు చివరి అవకాశం

image

DOST ద్వారా DEGREE కళాశాలలో స్పెషల్ ఫేజ్ ద్వారా ప్రవేశాలు పొందేందుకు మరొక సువర్ణ అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సంగీత పేర్కొన్నారు. SEP 9లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని SEP 4 నుంచి 9 వరకు వెబ్ అప్షన్లు పెట్టుకోవాలన్నారు. SEP 11న సీట్ల కేటాయింపు ఉంటుందని SEP 11 నుంచి 13 వరకు ఆన్ లైన్ పేమెంట్ పూర్తి చేయాలని, SEP 12 నుంచి 13లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.

News September 3, 2024

సిర్పూర్ (టి)లో విషాదం.. డెంగ్యూతో బాలిక మృతి

image

సిర్పూర్ (టి)మండలంలోని వెంకట్రావు పేట్ గ్రామానికి చెందిన గంగోత్రి (16) డెంగ్యూతో మృతి చెందింది. సోమవారం బాలికను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. డెంగ్యూ జ్వరాలపై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

News September 3, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,789 ఆత్మహత్యలు

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చిన్న విషయాలకు సైతం మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2023, 2024 సంవత్సరాల్లో 1,789 మంది ఆత్మహ్యత చేసుకున్నారు. ఆదిలాబాద్-453, నిర్మల్-452, మంచిర్యాల-611, కొమురం భీం-273 మంది సూసైడ్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

News September 3, 2024

ఆదిలాబాద్: నేడు విద్యాసంస్థలకు సెలవు : కలెక్టర్

image

అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు నేడు (ఈనెల 3)న సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. అన్ని విద్యాసంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాలతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

News September 2, 2024

ADB ప్రజావాణిలో 35 అర్జీల స్వీకరణ

image

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరం సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల భాగంగా మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వీకరించారు. ఈ సందర్భంగా 35 మంది వద్ద అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వారి సమస్యను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, అధికారులు ఉన్నారు.