India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మందమర్రి పట్టణంలోని మూడో జోన్కు చెందిన దురిశెట్టి సాధన పాముకాటుకు గురై మృతి చెందింది. సోమవారం సాయంత్రం ఇంట్లో అన్నం తింటుండగా పాము కాటు వేసినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి సకురా సైన్స్ ప్రొగ్రామ్ పోటీలకు బోథ్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని రసజ్ఞ ఎంపికయ్యారు. గత సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయిలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, ఇంగ్లిష్లో ప్రావీణ్య పోటీలను నిర్వహించారు. రసజ్ఞ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటింది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి జపాన్ పర్యటనకు పంపనున్నారు.
ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. అయితే కొంత మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ కాగా, మిగతా వారికి సగం కంటే తక్కువ, ఇంకొంత మందికి అసలుకే రాక బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో మొదటి విడత 18,821 మంది రైతులకు రూ.120.79 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ఖాతాలో మాత్రం డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరి 31తో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జీపీలకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేపట్టింది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలుండగా వాటి పరిధిలో 3,830 వార్డులున్నాయి. వీటికి 2018లో ఎన్నికలు జరిగాయి.
వర్షాకాలం సీజన్లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ రేట్లు కొండెక్కాయి. వానా కాలంలో చికెన్, మటన్ కంటే ఔషధ గుణాలున్న బోడ కాకరకాయ తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ అని డాక్టర్లు చెబుతుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. నేరడిగొండ మండల కేంద్రంలో కిలో రూ.400 పలుకుతోంది. కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం, ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో రేటు ఎక్కువైనా జనం వీటిని కొంటున్నారు.
కడెం ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి సుమారు 8,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం 695 అడుగులకు నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 699 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాలువలకు 379, మిషన్ భగీరథ 9, దిగువకు 8178 మొత్తం కలిపి 8634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఢిల్లీ రాజేంద్రనగర్లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా మంచిర్యాల జిల్లాకు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఆమె తండ్రి శ్రీరాంపూర్-1 భూగర్భ గని డీజీఎంగా పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మంచిర్యాల జిల్లా భీమారంలో చోటుచేసుకుంది. మండలంలోని దాంపూర్ గ్రామ పంచాయతీ గోత్రాల వాడకు చెందినమధుకర్ (55) మండలంలోని కాజీపల్లి చెరువు వద్దకు చేపల వేటకోసం వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా చెరువులో శవమై కనిపించాడు. కాగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేటీఆర్ ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శించడంపై చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు క్షమించమని కాళేశ్వరంలో పూజలు చేసేందుకు వచ్చినట్లు ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.
మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో అనుమానాస్పదస్థితిలో ఒక మహిళ దుర్మరణం పాలైనట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మృతురాలు గోదావరి నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ముఖం గుర్తుపట్టకుండా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక పాత మంచిర్యాలకు చెందిన ధరణి పద్మ అనే మహిళ ఈనెల 25 నుంచి కనిపించకుండా పోయింది. మృతురాలు పద్మ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.