India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శుక్రవారం మంచిర్యాల ఏసీసీ వద్ద రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్దెరాగడికి చెందిన రాజు(30) శుక్రవారం రాత్రి ఏసీసీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో నస్పూర్‌కు చెందిన వినయ్‌కుమార్(27) బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. వినయ్‌కుమార్ శనివారం HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.
ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులకు సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల కొరకు ఉచిత శిక్షణ కోచింగ్ ను టీజీఎస్సీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి సునీత కుమారి తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్ సైట్ http://tsstudycircle.co.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
◾బోథ్: ఉదృతంగా ప్రవహిస్తున్న పొచ్చర జలపాతం◾ ఇంద్రవెల్లి: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య◾ ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుకు ప్రభుత్వం సహకరించాలి: పాయల్◾ఆదిలాబాద్: పాలిటెక్నిక్ లో చేరేందుకు మరొక అవకాశం◾ తలసరి ఆదాయంలో వెనుకబడిన ఆసిఫాబాద్◾ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలి: జాజుల◾ ADB వైద్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ బదిలీలు◾ కడెం ప్రాజెక్ట్ ఒక గేట్ ఎత్తివేత
సాధారణ బదిలీల్లో భాగంగా వైద్య శాఖలో సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ బి.రవీందర్ నాయక్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఆదిలాబాద్ రిమ్స్, DMHO కార్యాలయం నుంచి PHCలకు, PHCల నుంచి DMHO కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన వారిలో జిల్లా వ్యాప్తంగా 15 మంది సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.
పాలిటెక్నిక్ డిప్లమాలో ప్రవేశానికి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుపుతున్నామని ఆదిలాబాద్ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్/ పాలిసెట్ కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు. ఈ నెల 26న స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. 27న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని, 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 31న సీట్లు కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు గమనించాలన్నారు.
తలసరి ఆదాయంలో ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక ముఖచిత్రం 2024లో తలసరి ఆదాయం విషయంలో 32వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు మెరుగైన స్థానంలో ఉండగా, కొమురం భీం వెనుకబడి కనిపిస్తోంది. రాష్ట్రంలో తలసరి ఆదాయం విషయంలో మంచిర్యాల 18, నిర్మల్ 21, ఆదిలాబాద్ 22 స్థానాల్లో నిలిచాయి.
అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం ఆమె పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
◆ ఆదిలాబాద్ : కట్నం విషయంలో భర్తకు జైలుశిక్ష
◆ ఆసిఫాబాద్ : ఆన్లైన్ మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్టు
◆ రెబ్బెన : గేదెలు తరలిస్తున్న నలుగురిపై కేసు
◆ బెల్లంపల్లి : గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
◆ కుబీర్ : RTC బస్సు కిందపడి మహిళ మృతి
◆ కాగజ్ నగర్ : ఇంటిగోడ కూలి.. మహిళ మృతి
◆ ఆదిలాబాద్ : ఫ్యాన్ కు ఉరేసుకొని యువకుడు సూసైడ్
◆ ముథోల్: గంజాయి పట్టివేత.. నిందితుల అరెస్ట్
అదనపు కట్నం విషయంలో భార్యను వేధించిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానాను విధిస్తూ ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2017 మార్చి నెలలో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తలమడుగు PSలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 7గురు సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన నిందితుడు లచ్చన్నకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. స్పెషల్ విడత ద్వారా జులై 25 నుంచి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జులై 27 నుంచి ఆగస్టు 3వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.
>>SHARE IT
Sorry, no posts matched your criteria.