India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద శనివారం పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 13,50,000 నగదు పట్టుబడినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. ఎలాంటి నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలతో డీఎంహెచ్ఓ డాక్టర్ సుబ్బరాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమచికిత్స కేంద్రం అని బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి బెడ్స్, శాంపిల్స్ మెడిసిన్ ఉండవద్దన్నారు. పరిమితికి మించి వైద్యం చేయరాదని, ఎలాంటి యాంటిబయాటిక్స్ వాడరాదని సూచించారు. నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బానోత్ అక్షయ్ మృతి చెందారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే ఆయన తీవ్ర గాయాలపాలవ్వగా చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.
నిర్మల్ జిల్లా బైంసా మండలం బాబుల్ గావ్ గ్రామస్తులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్న కలెక్టర్ ఆదేశాలు కూడా
అధికారులు లెక్కచేయడం లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామంలో నీటి సమస్య ఉన్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పక్క గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 5 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు పార్టీల అభ్యర్థులు ఆత్రం సుగుణ, గోడం నగేశ్, ఆత్రం సక్కు గ్రామాలలో పర్యటిస్తూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.
ఉమ్మడి ADB జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే గత ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ADB లోక్ సభ పరిధిలోని 2111 పోలింగ్ కేంద్రాలలో 16,44,715 మంది ఓటర్లకు చోటు దక్కగా.. పెద్దపల్లి పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లాలో 754 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6,47,646 మంది ఓటర్లకు చోటు లభించింది. అయితే ఈ నెల 15 వరకు ఓటరు నమోదు, మార్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇద్దామని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఈ నెల 16న కేటీఆర్ ఆదిలాబాద్ వస్తున్నారని, కార్యకర్తలు సకాలంలో హాజరై కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు. బోథ్ నియోజకవర్గంలోని 302 బూతుల నుంచి కార్యకర్తలు కష్టపడి 90 వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శుక్రవారం HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్, మంచిర్యాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు సాయంత్రం పూట బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
గాదిగూడ మండల పరిధిలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఉమ్మడి నార్నూర్ మండలంలో గత నాలుగు రోజుల్లో దాదాపు 18 కిలోలతో కూడిన సుమారు రూ.4.50 లక్షల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కుంటాల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దాన్ల రాజు (40) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తిరిగి ఓల గ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడిపోయాడు. ముఖంపై, తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.