India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళను ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన కాసిపేట మండలంలో చోటుచేసుకుంది. లంబడి తండా గ్రామానికి చెందిన అజ్మీరా నీలా (45) భర్త 15 ఏళ్ల క్రితం మరణిచడంతో గాండ్ల రవి అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. రవి స్నేహితుడు అంబరావు బుధవారం రవి లేని సమయంలో నీలా పై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దార్‌లు16 మంది, సినియర్. 25 మంది, జూ.అసిస్టెంట్లు 15 మంది, ఆఫీస్ సబార్డినేట్లు 18 మంది ఉన్నారు. వారితో పాటు ఐదుగురు తహశీల్దార్లకు రిలీవింగ్ ఆర్డర్లు జారీ అయ్యాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అలర్ట్ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారివర్షాలకు ఉమ్మడి జిల్లాలో ఉన్న జలపాతాలు జలసవ్వడి చేస్తున్నాయి. ప్రాజెక్టులు నీరు వచ్చి చేరడంతో కళకళలాడుతున్నాయి.
★ఆసిఫాబాద్: అడ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
★ కాగజ్ నగర్: గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
★ ఆదిలాబాద్: కాంగ్రెస్ నాయకునిపై ఎస్పీకి జర్నలిస్టుల ఫిర్యాదు
★ మంచిర్యాల : కిటికీలు ఎత్తుకెళ్లిన దొంగలు అరెస్ట్
★ దహేగాం: భారీ వర్షానికి కూలిన ఇల్లు
★ కుబీర్ : పేకాట ఆడుతున్న 6గురు అరెస్ట్
★ తాంసి: తోడేళ్ల దాడి.. ఐదు మేకలు మృతి
★ భీంపూర్: పశువుల పాకలోకి దూసుకెళ్లిన RTC
మందమర్రి ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా 2023-24ఆర్థిక సంవత్సరంలో వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన 187 మంది మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. జీఎం ఏ.మనోహర్, సేవా అధ్యక్షురాలు సవిత మనోహర్ మాట్లాడుతూ.. మహిళలు అవకాశాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సంపాదించుకుని కుటుంబాలకు మార్గదర్శకంగా నిలబడాలన్నారు.
కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ బుదవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. NH 44 బోరజ్ నుంచి ఉపాస్నాల (మహారాష్ట్ర) గల 33 కి.మీ. రోడ్డును కేవలం 2 వరసల రోడ్డు మాత్రమే మంజూరు చేసినందున.. దీనిని కూడా 4 వరసల రహదారులుగా మార్చాలని మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ 4వరుసలుగా మార్చడానికి కొత్తగా మరో డీపీఆర్‌ను తయారు చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు ఎంపీ తెలిపారు.
పుట్టిన 40రోజులకే ఆధార్‌కార్డు పొందిన అతి పిన్న వయస్కురాలిగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో ఐజాల్ ఫాతిమా స్థానం పొందింది. నస్పూర్‌కు చెందిన అఫ్జల్ పాషా-సమీరాతబస్సుమ్ దంపతులకు 2024జనవరి12న కుమార్తె ఐజాల్ ఫాతిమా జన్మించింది. ఫిబ్రవరి 21న ఆధార్‌కార్డు పొందింది. దీంతో చిన్నారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. 43రోజుల పాత రికార్డును ఫాతిమా అధిగమించింది.
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని 5 ప్యాకేజీలు ప్రవేశపెట్టారు. ఉద్యోగులతో పాటు ఉద్యోగాలు ఇచేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఉద్యోగంలో చేరిన ఫస్ట్ నెల సాలరీ 3 వాయిదాల్లో రూ.15వేల వరకు ప్రభుత్వం చెల్లించనుంది. గరిష్ఠంగా లక్షలోపు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో యూత్ 3.25 లక్షలు ఉన్నారు. అందులో నిరుద్యోగులు 68 వేల మంది ఉన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఉపయుక్తంగా మారనుంది.
నిర్మల్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్‌లో గురువారం వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలం ఉంటుందని ఎక్సైజ్ అధికారి ఎండి రజాక్ తెలిపారు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు ద్విచక్ర వాహనాలు 18, మహేంద్ర బొలెరో 1, కార్లు 3, ప్యాసింజర్ ఆటోలు 3, ఒక ట్రాలీ ఆటో మొత్తం 26 వాహనాలకు బహిరంగ వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఎక్సైజ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
జన్నారం మండలంలోని ఆదివాసి, గిరిజన గ్రామాలకు వెళ్ళే రోడ్లు చిత్తడిగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట అనుబంధ రాయి సెంటర్ గ్రామానికి వెళ్లాలంటే కచ్చా రోడ్డు ఉంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ఆ రోడ్డుపై కనీసం నడవలేని పరిస్థితి ఉందని రాయి సెంటర్ గ్రామస్థులు వాపోయారు. తమ గ్రామానికి రోడ్డును నిర్మించాలని వారు కోరారు.
Sorry, no posts matched your criteria.